29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Bihar Elections: నేడు రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ.. ఎన్నికల కసరత్తుపై చర్చ

Date:

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్‌లో పర్యటించనున్నారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు వివేక్‌ జోషి, ఎస్‌ఎస్‌ సంధు రెండ్రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్నారు. శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లాక.. వచ్చే వారం ఏదొక సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!

ఈరోజు ఉదయం 10 గంటలకు బీహార్‌లో గుర్తింపు పొందిన పలు జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను, ఇతర సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్వీకరించనుంది.

ఇది కూడా చదవండి: Trump-Hamas: ట్రంప్ ప్లాన్‌పై హమాస్ సంచలన నిర్ణయం

ఇక సెప్టెంబర్ 30న ఎన్నికల సంఘం బీహార్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం బీహార్‌లో 7 కోట్ల 42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికారికంగా ఈ జాబితాను ఈసీ విడుదల చేసింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ గడువు 2025 నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరు నాటికి లేదా నవంబర్‌ ప్రారంభంలోనైనా ఎన్నికలు ముగించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹൂത്തികളും ആക്രമണം ആരംഭിച്ചതോടെ കൂടുതല്‍ സേനയെ വിന്യസിക്കാന്‍ യു.എസ്; 2500 നാവികര്‍ പശ്ചിമേഷ്യയിലെത്തി; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരായ യു.എസ്, ഇസ്രഈല്‍ ആക്രമണത്തെ പ്രതിരോധിക്കാനായി യെമനിലെ വിമതസേനയായ ഹൂത്തികള്‍...

அதிமுக இறுதிக்கட்ட வேட்பாளர்கள்: ஆம்ஸ்ட்ராங் மனைவி பொற்கொடிக்கு சென்னை தொகுதி; இபிஎஸ் அறிவிப்பு

ஏப்ரல் மாதம் 23-ம் தேதி தமிழ்நாட்டில் சட்டமன்றத் தேர்தல் நடைபெற இருக்கிறது....

Kamada Ekadashi 2026: కోరిన కోరికలు తీర్చే కామదా ఏకాదశి.. ఈ కథను పఠిస్తే జన్మ జన్మల పాపాల నుండి మోక్షం

కామదా ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన ఏకాదశి. ఇది...

ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಆರೋಪ: ಸ್ಪಷ್ಟನೆ  ನೀಡಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್...