29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Odisha: ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ 117 మంది..!

Date:

Odisha: ఒడిశా స్టేట్ ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టయింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్నపత్రాను తీసుకెళ్తున్న ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకైన పేపర్‌ను విజయనగరంలో తీసుకోవడానికి వెళ్తున్న 114 మంది అభ్యర్థులు, ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు బస్సుల్లో వెళ్తున్నట్లు ఒరిస్సా పోలీసులు సమాచారం అందింది. దీంతో ఎచ్చర్ల వద్ద మూడు బస్సులను తనిఖీ చేసిన శ్రీకాకుళం పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను ఒరిశా పోలీసులకు అప్పగించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షలు డీలింగ్ కుదిరినట్లు సమాచారం. రూ.10 లక్షలు ముందుగానే చెల్లించాలి. ఉద్యోగం పొందిన తర్వాత మిగిలిన రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందం కుదిరింది.

READ MORE: YS Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..

పోలీసుల కథనం ప్రకారం.. బెర్హంపూర్ పోలీసు బృందానికి రహస్య సమాచారం అందింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు ఎసీ స్లీపర్ బస్సులను అడ్డగించారు. భువనేశ్వర్‌లోని బారాముండా బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ బస్సుల్లో 117 మంది ప్రయాణికులు ఉన్నారు. విచారణలో వారిలో 114 మంది సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్షకు అభ్యర్థులు అని, భారీ నెట్‌వర్క్ కలిగిన ముగ్గురు ఏజెంట్ల సహాయంతో ప్రయాణిస్తున్నారని వెల్లడైంది. వాస్తవానికి.. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి భువనేశ్వర్ తిరిగి వచ్చే ముందు విజయనగరంలో రహస్య ప్రశ్నాపత్రాలను పొందేందుకు కుట్ర పన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪತಿ ಮರಣದ ನಡುವೆಯೂ ಕರ್ತವ್ಯ ನಿಭಾಯಿಸಿದ ಶಿಕ್ಷಕಿ: ಶಾಸಕರಿಂದ ಶ್ಲಾಘನೆ

  ಮೈಸೂರು, March.29,2026: ವೈಯಕ್ತಿಕ ದುಃಖದ ನಡುವೆಯೂ ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಆದ್ಯತೆ ನೀಡಿದ...

കോണ്‍ഗ്രസ് ചെലവാക്കിയതിനേക്കാള്‍ അഞ്ചിരട്ടി പണം ബി.ജെ.പി കേരളത്തിനായി ചെലവിട്ടു; വികസനത്തിനുള്ള പണം സര്‍ക്കാര്‍ കൊള്ളയടിച്ചു: മോദി

പാലക്കാട്: കേരളത്തില്‍ ബി.ജെ.പി സര്‍ക്കാരുണ്ടാക്കുമെന്ന അവകാശവാദവുമായി പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി. പാലക്കാട്...

தவெக: '24 பெண்கள்; 11 இஸ்லாமியர்கள்; 11 கிறிஸ்துவர்கள்' – விஜய்யின் வேட்பாளர் பட்டியலின் ஹைலைட்!

தவெக சார்பில் 234 தொகுதிகளிலும் போட்டியிடும் வேட்பாளர்களின் பட்டியலை விஜய் இன்று...