30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Vijayawada: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. వీఐపీ దర్శనాలపై ఆలయ ఈవో అసహనం

Date:

Vijayawada: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రుల నాలుగో రోజు సాయంత్రం 5 గంటల వరకు 66 వేల 300 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం, ప్రసాదం, ఇతర సేవల ద్వారా 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ తెలిపారు. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మరో 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

READ MORE: Gunda Prakash Rao: వరంగల్ నగర మాజీ మేయర్ అరెస్ట్.. ఎందుకంటే?

ఇక వీఐపీ దర్శనాలపై ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అసహనం వ్యక్తం చేశారు. “వీఐపీలు ప్రోటోకాల్ సమయాలను ఇప్పటికే మార్చాం. కానీ కొంతమంది ఇచ్చిన సమయాల్లో కాకుండా వేరే సమయంలో వస్తున్నారు. అందరూ విఐపిల మాదిరిగా వస్తే కొండపై వాహనాలకు స్థలం ఉండదు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. కాబట్టి వీఐపీలు కచ్చితంగా కేటాయించిన స్లాట్లలోనే రావాలి. ఇవ్వని సమయాల్లో వస్తే మేము తాళాలు వేసుకుని ఛాంబర్‌లో కూర్చుంటాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడమే మా ప్రధాన లక్ష్యం” అని ఈవో స్పష్టం చేశారు.

READ MORE: Hyderabad Metro: కీలక పరిణామం.. హైదరాబాద్ మెట్రో నుంచి తప్పుకున్న ఎల్ ఎండ్ టి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

KSRTC  ಬಸ್ ಗಳಿಗೆ  ತಕ್ಷಣಕ್ಕೆ ಡೀಸೆಲ್ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ- ಸಚಿವ ರಾಮಲಿಂಗರೆಡ್ಡಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದದಿಂದಾಗಿ ಈಗಾಗಲೇ ದೇಶಾದ್ಯಂತ ಎಲ್ ಪಿಜಿ...

மனோ தங்கராஜ்: `அமைச்சருக்கே சீட் இல்லியா?' – இரவு வரை போராட்டம் – நிர்வாகிகள் சொல்வது என்ன?

கன்னியாகுமரி மாவட்டம் பத்மநாபபுரம் சட்டமன்ற தொகுதியில் சிட்டிங் அமைச்சர் மனோ தங்கராஜிக்கு...

Bihar: ఎమ్మెల్సీకి నితీష్ కుమార్, ఎమ్మెల్యే పదవికి నితిన్ నవీన్ రాజీనామా

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి నితీష్...