24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Asia Cup 2025: గిల్‌ చిన్నప్పటి నుంచి తెలుసు.. నేను గుర్తున్నానో లేదో: యూఏఈ బౌలర్

Date:

ఆసియా కప్‌ 2025 ఈరోజు యూఏఈలో ఆరంభం కానుంది. అబుదాబిలో రాత్రి 8 గంటలకు హాంకాంగ్, అఫ్గానిస్థాన్‌ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్‌ 10న యూఏఈతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, యూఏఈ ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌తో తనకున్న అనుబంధాన్ని యూఏఈ బౌలర్ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ గుర్తుచేసుకున్నాడు. గిల్‌ చిన్నప్పటి నుంచే తనకు తెలుసు అని.. కానీ ఇప్పుడు అతడికి నేను గుర్తున్నానో లేదో తెలియదు అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘శుభ్‌మన్‌ గిల్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ అతడికి నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో గిల్‌కు 11 లేదా 12 ఏళ్లు ఉంటాయి. మేము ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అకాడమీలో శిక్షణ పొందేవాళ్లం. గిల్ తన తండ్రితో కలిసి ప్రాక్టీస్‌కు వచ్చేవాడు. మా సెషన్‌ అనంతరం కూడా చాలా సమయం నేను బౌలింగ్‌ చేసేవాడిని. ఆ సమయంలో నేను గిల్‌కు బౌలింగ్ చేశాను. ఇప్పుడు అతడు నన్ను గుర్తుపడతాడో లేదో తెలియదు’ అని సిమ్రన్‌జిత్‌ సింగ్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్ సిమ్రన్‌జిత్‌కు అంతర్జాతీయ మ్యాచ్ కంటే ఎక్కువ అని చెప్పాలి.

‘నేను ఏప్రిల్ 2021లో 20 రోజుల ప్రాక్టీస్ కోసం దుబాయ్ వచ్చాను. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా భారతదేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించారు. దీంతో నేను నెలల తరబడి ఇక్కడే ఉండిపోయాను. క్లబ్ క్రికెట్ ఆడుతూ జూనియర్లకు శిక్షణ ఇచ్చాను. యూఏఈ తరఫున అర్హత సాధించడానికి మూడు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడాను. చివరకు యూఏఈ బోర్డుతో ఒప్పందం కుదిరింది’ అని సిమ్రన్‌జిత్‌ సింగ్‌ చెప్పాడు. సిమ్రన్‌జిత్‌ పంజాబ్‌లో జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడాడు. 2017లో రంజీ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. అది పెద్దగా కలిసిరాలేదు. కరోనా సమయంలో ప్రాక్టీస్ కోసం దుబాయ్ వెళ్లడం అతడికి కలిసొచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

தேர்தல் ஆணையம்: “இதனால்தான் இந்த விவகாரம் சர்ச்சையாகியுள்ளது..!" – முன்னாள் ஆணையர் சொல்வதென்ன?

தேர்தல் ஆணையத்தில் பெரும்பான்மை உறுப்பினர்களின் ஆதரவோ அல்லது ஒருமித்த கருத்தோ இன்றி...

AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం...

കുടുംബ കലഹങ്ങള്‍ വേണ്ട; എ.ഐ ക്യാമറ നിയമ ലംഘന നോട്ടീസുകളില്‍ ചിത്രങ്ങള്‍ ഒഴിവാക്കാന്‍ എം.വി.ഡി

തിരുവനന്തപുരം: മോട്ടോര്‍ വാഹന വകുപ്പിന്റെ എ.ഐ ക്യാമറകള്‍ വഴിയുള്ള നിയമലംഘനങ്ങള്‍ പരിശോധിക്കുന്നതിനുള്ള...

“நாங்கள் யார் மீதும் போர் தொடுத்ததில்லை; எங்கள் மீது போர் திணிக்கப்பட்டது!” – ஐ.நா-வில் ஈரான் அதிபர்

ஈரான் போர் தொடர்ந்துகொண்டிருக்கும் இதே வேளையில், அமெரிக்காவிற்குச் சென்றிருக்கிறார் ஈரான் அதிபர்...