12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Tollywood : ఇప్పటికైనా ఆ హీరోయిన్ ను టాలీవుడ్ దర్శకులు గుర్తిస్తారా

Date:

అక్కినేని అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన  కళ్యాణి ప్రియదర్శని ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్‌ చేసినా సరైన సక్సెస్‌ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. దాంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయి తమిళ,మలయాల చిత్రాలపై  శ్రద్ధ చూపిస్తోంది. మలయాళంలో మొదటి సినిమా ‘మరక్కార్’ డిజాస్టర్ అయినా తరువాత చేసిన హృదయం మూవీతో క్రేజ్‌ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా, ఆంటోనీ, వర్షంగళక్కు శేషం లాంటి సినిమాలతో కళ్యాణికి మలయాళ ఇండస్ట్రీలో డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం కళ్యాణి తమళ్‌లో జీని, కార్తి 29 ఉన్నాయి.

Also Read : Karthi : ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కార్తీ..

తాజాగా మళయాలంలో ఫహద్‌ ఫాజిల్‌తో ఒడుం కుతిర చద్దాం కుతిరా, దుల్కర్‌ సల్మాన్‌తో వే ఫారర్ ఫిలింస్ బ్యానర్‌పై  ‘లోక’ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. లోక కేరళలో ఓనం కానుకగా రిలీజ్ అయి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే తొలి అవకాశం ఇచ్చిన టాలీవుడ్‌ని పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు అప్పట్లో కళ్యాణిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు  మలయాళంలో తన అద్భుతమైన నటనతో అదరగొడుతుంది. మళ్లీ టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇవ్వాలంటే, ఒక బలమైన స్క్రిప్ట్, మంచి కంటెంట్ కావాలి. లేదంటే, కళ్యాణీ… టాలీవుడ్‌కి “హలో” చెప్పకుండా అక్కడే ఉండి పోయేలా ఉంది. టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్‌ మూవీ మేకర్స్‌. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.  మరో సూపర్ ఉమెన్ గా అదరగొట్టిన కళ్యాణి ప్రియదర్శన్ ను తెలుగు దర్శకులు ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹಿರಿಯ ಪತ್ರಕರ್ತ ಕೆ ಜೆ. ಕುಮಾರ್ ನಿಧನ: ಇಂದು ಅಂತ್ಯಕ್ರಿಯೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in):  ನಿನ್ನೆ ಹೃದಯಾಘಾತದಿಂದ ನಿಧನರಾದ ಹಿರಿಯ ಪತ್ರಕರ್ತ ಕೆ...

മലയാളം എവിടെ? ചങ്ങനാശ്ശേരി റെയില്‍വേ സ്‌റ്റേഷനിലെ ഹിന്ദി ബോര്‍ഡിനെതിരെ സോഷ്യല്‍ മീഡിയ

കോട്ടയം: ചങ്ങനാശ്ശേരി റെയില്‍വേസ്റ്റ്ഷനിലെ പുതുക്കിയ പ്രവേശന കവാടത്തിലും കെട്ടിടത്തിലും ഹിന്ദിയില്‍ ബോര്‍ഡ്...

Suryakumar Yadav: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన సూర్య.. గంభీర్ స్పీచ్‌తో ప్లేయర్లలో పూనకాలు!

Suryakumar Yadav: భారత్ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడు సార్లు...