25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

MP: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడిపై 13 గంటలు దాడి

Date:

తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. వ్యామోహాన్నే ప్రేమ అనుకుని దారి తప్పుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక అమ్మాయి కోసం 100 కి.మీ ప్రయాణం చేశాడు. చివరికి అమ్మాయి కుటుంబ సభ్యుల చేతిలో చిక్కుకుని 13 గంటలు నరకం అనుభవించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Kangana Ranaut : ఫైనలీ.. పెళ్లి రూమర్స్‌కి చెక్ పెట్టిన కంగనా రనౌత్

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఒక యువకుడికి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయి స్నేహితురాలిగా మారింది. దీంతో శనివారం ఆమెను కలిసేందుకు 100 కి.మీ ప్రయాణం చేసి మౌగంజ్‌లోని పిప్రాహి గ్రామానికి చేరుకున్నాడు. అమ్మాయిను కలవకముందే కుటుంబ సభ్యులకు చిక్కాడు. అంతే యువకుడి చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి చితకబాదారు. శనివారం రాత్రి 9 గంటలకు మొదలు పెట్టి.. ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొడుతూనే ఉన్నారు. ఇలా ఏకధాటిగా 13 గంటలు కొడుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Pilli Sattibabu Resigns: చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన పిల్లి సత్తిబాబు

యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఫేస్‌బుక్‌లో మైనర్ అమ్మాయితో బైకుంత్పూర్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడిందని.. ఆమెను కలిసేందుకు 100 కి.మీ ప్రయాణం చేసి వచ్చినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు పట్టుకుని 13 గంటల పాటు కొట్టారని పేర్కొన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని హనుమాన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. అయినా కూడా పూర్తి సమాచారం సేకరించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നിയുക്ത മുഖ്യമന്ത്രിക്ക് അഭിവാദ്യങ്ങള്‍; കണ്ണൂരില്‍ വി.ഡി. സതീശന് അഭിവാദ്യമര്‍പ്പിച്ച് ഫ്‌ളക്‌സ്

കണ്ണൂര്‍: കോണ്‍ഗ്രസില്‍ മുഖ്യമന്ത്രി ആരാകുമെന്ന തര്‍ക്കം മുറുകുന്നതിനിടെ കണ്ണൂര്‍ പഴയങ്ങാടി ബി.ബി....

Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

Off The Record: కొణిదెల నాగబాబు…. జనసేన ఎమ్మెల్సీ. ఆయనకు మంత్రి...

ನಾನೂ ಸೇರಿ AAP 7 ಸಂಸದರು ಬಿಜೆಪಿ ಸೇರ್ಪಡೆ: ರಾಘವ್ ಛಡ್ಡಾ ಘೋಷಣೆ

ನವವದೆಹಲಿ,ಏಪ್ರಿಲ್,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯಸಭಾ ಸಂಸದ ರಾಘವ್ ಛಡ್ಡಾ ಅವರು ಎಎಪಿ...