24
March, 2026

A News 365Times Venture

24
Tuesday
March, 2026

A News 365Times Venture

Off The Record: కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టుతో హరీష్ రావు ఏం చేయబోతున్నారు..?

Date:

Off The Record: కాళేశ్వరం కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్‌లు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్, వెంకటేశ్వర్లు పలువురు అధికారులపై ఆరోపణలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేశారు. అయితే మాజీ మంత్రి హరీశ్‌రావు…సీఎస్ రామకృష్ణారావును కలవడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కోసమే సీఎస్‌ను కలిసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే 60 పేజీల పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై…ఇంతకు ముందే మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల నుంచి నిర్మాణం వరకు అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

Read Also: Ganja : ఏపీ నుంచి ఢిల్లీకి భారీగా గంజాయి తరలింపు..

ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కమిషన్‌పై కూడా సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వెంటనే సీఎస్‌ను కలిసిన హరీశ్‌రావు…పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ఇవ్వాలని కోరారు. అందుకోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు…ఇద్దరు వేరువేరుగా సీఎస్‌కు లేఖలు. ప్రస్తుతం ముగ్గురు ఐఏఎస్‌లు తయారు చేసిన 60 పేజీల నివేదికను స్టడీ చేసి… తర్వాత 665 పేజీల రిపోర్టును స్టడీ చేస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు.

Read Also: Surprising Reasons : అది మాల్ అయినా, థియేటర్ అయినా, టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది..?

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరిగి వాటి నుంచి ధ్రువీకరణ పత్రాలు సంపాదించారు. పీసీ ఘోష్ కమిషన్ తప్పు పట్టిన అంశాలను…మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకే వెళ్లి సమాధానం చెప్పించాలని హరీశ్‌రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టుల అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాలపై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో జరిగే అసెంబ్లీలో 665 పేజీల నివేదిక ప్రభుత్వం సభ్యులందరికి ఇస్తుందా? 60 పేజీల నివేదికను మరికొంత పెంచి ఇస్తుందా? చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮಾ.25 ರಂದು ರಾಜ್ಯಮಟ್ಟದ ‘ಅಂತರ್ ವಿದ್ಯುತ್ ಕಂಪನಿಗಳ ಕ್ರೀಡಾಕೂಟ’

ಮಂಡ್ಯ,ಮಾರ್ಚ್,23,2026 (www.justkannada.in):  ಚಾಮುಂಡೇಶ್ವರಿ ವಿದ್ಯುತ್ ಸರಬರಾಜು ನಿಗಮ ನಿಯಮಿತ ಮೈಸೂರು...

ലോക്‌സഭാ സീറ്റുകള്‍ വര്‍ധിപ്പിച്ച് വനിതാ സംവരണത്തിനൊരുങ്ങി കേന്ദ്രം; വര്‍ധിപ്പിക്കുന്ന 273 സീറ്റുകള്‍ വനിതകള്‍ക്ക്

ന്യൂദല്‍ഹി: ലോക്‌സഭയില്‍ വനിതാ സംവരണം നടപ്പിലാക്കാനായി കേന്ദ്ര സര്‍ക്കാര്‍ സീറ്റ് വര്‍ധിപ്പിക്കുന്നു....

'இரட்டை இலக்க தொகுதிகள்; ராஜ்ய சபா சீட்…' – திமுக கூட்டணியில் திடீர் டிமாண்ட் ஏற்றும் திருமா!

திமுகவில் கூட்டணி கட்சிகளுடனான பேச்சுவார்த்தை இழுபறியாகவே போய் கொண்டிருக்கிறது. கறாராக பேசிக்கொண்டிருந்த...

Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

Double Bedroom House Scam: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ...