3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

HYDRA : న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. రంగంలోకి దిగిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

Date:

HYDRA : న‌గ‌రంలో సోమ‌వారం భారీ వ‌ర్షం కురిసింది. గంట వ్య‌వ‌ధిలో 7 నుంచి 8 సెంటీమీట‌ర్ల వ‌ర‌కూ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో ర‌హ‌దారులు, లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశాల‌ను రెండు గంట‌ల ముందుగానే గ్ర‌హించిన హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారుల‌ను, సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌జావాణి ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలోనే భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో హైడ్రా క‌మిష‌న‌ర్ నేరుగా వ‌ర‌ద ముప్పు ఉన్న ప్రాంతాల‌కు వెళ్లారు. ల‌క‌డికాపూల్‌, ఖైర‌తాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. క్షేత్ర‌స్థాయిలో ఉన్న డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. హైడ్రా మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ బృందాల‌తో మాట్లాడి వ‌ర‌ద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు.

Ajith Kumar : ఘోరంగా అవమానించారు.. అజిత్ ఎమోషనల్ నోట్

కొన్ని చోట్ల చెట్లు విరిగి ప‌డ‌గా.. సిబ్బంది వాటిని తొల‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. మ‌రికోన్న చోట్ల వ‌ర‌ద‌కు చిక్క‌కున్న కార్ల‌ను ప‌క్క‌కు తొల‌గించి.. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఇబ్బంది లేకుండా చేశారు. జూబ్లీహిల్స్‌, జీడిమెట్ల‌, ఉప్ప‌ల్ ఇలా అన్ని ప్రాంతాల్లో జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల‌తో స‌మ‌న్వ‌యంగా ప‌ని చేసి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చూశారు. రోడ్డు అండ‌ర్ బ్రిడ్జిల వ‌ద్ద ఆటోమేటిక్ డీవాట‌ర్ పంపుల‌కు తోడుగా హైడ్రా నీటి పంపుల‌ను కూడా ఉంచి.. వ‌ర‌ద ముప్పు లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఎక్క‌డైనా వ‌ర‌ద ముప్పు ఉన్న‌ట్ల‌యితే రౌండ్‌ది క్లాక్ ప‌ని చేసే హైడ్రా కంట్రోల్ రూమ్ (9000113667)కి ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

Uttam Kumar Reddy : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్‌ వేశాం

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മാപ്പ് മാപ്പ് മാപ്പ്; സവര്‍ക്കര്‍ ബ്രിട്ടീഷ് ഭരണകാലത്ത് അഞ്ച് തവണ മാപ്പപേക്ഷ നല്‍കിയിരുന്നു: ചെറുമകന്‍

ന്യൂദല്‍ഹി: തീവ്ര ഹിന്ദുത്വവാദിയായ സവര്‍ക്കര്‍ ബ്രിട്ടിഷ് ഭരണകാലത്ത് അഞ്ച് തവണ മാപ്പപേക്ഷ...

Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు జర్మనీ టార్గెట్ చేసుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్...

50 ಸಾವಿರ ಲಂಚ ಸ್ವೀಕರಿಸುವಾಗ ಲೋಕಾಯುಕ್ತ ಬಲೆಗೆ ಸರ್ವೇ ಸೂಪರ್ ವೈಸರ್

ದಾವಣಗೆರೆ,ಮೇ,2,2026 (www.justkannada.in):  50 ಸಾವಿರ ಲಂಚ ಸ್ವೀಕರಿಸುತ್ತಿದ್ದ ವೇಳೆ ಸರ್ವೇ...