3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

Medak Murder: మైనర్ న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరింపు.. కట్‌చేస్తే..

Date:

Medak murder case: మెదక్ జిల్లా మగ్దుంపూర్‌లో యువకుడి డెడ్ బాడీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ అమ్మాయి న్యూడ్ వీడియోలు, ఫోటోలు దగ్గర ఉంచుకుని బెదిరించడమే హత్యకు కారణంగా గుర్తించారు. యువకున్ని హైదరాబాద్ బోరబండకు చెందిన సబిల్‌గా నిర్ధారించారు. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు సబిల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్లాపూర్‌లో ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా పని చేశాడు. గతంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ కారు మెకానిక్ షాపులో పని చేశాడు. ఆ సమయంలో మెకానిక్ షాపు ఓనర్ బంధువులైన బోరబండ అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. విషయం తెలిసి సబిల్‌ని పనిలో నుంచి తీసేశాడు కారు మెకానిక్ షాపు ఓనర్. ఐతే కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన మైనర్ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకు వెళ్లాడు సబిల్. ఐతే పక్కా అతడే తీసుకు వెళ్లాడని గుర్తించిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అతనిపై కేసు పెట్టారు. కిడ్నాప్ కేసు పెట్టడంతో.. కొన్ని రోజుల అనంతరం అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. కానీ ఆ తర్వాత సబిల్ చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది…

READ MORE: Nigerian Drug Mafia: హైదరాబాద్‌‌లో 2500 మంది నైజీరియన్‌లు.. ఏ డ్రగ్ కేసు చూసినా వీళ్లే..!

అమ్మాయి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఆమె తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అంతే కాదు వాటిలో కొన్నింటిని కుటుంబ సభ్యులకు పంపించాడు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఇది అమ్మాయి కుటుంబ సభ్యుల్లో తీవ్ర అలజడి రేపింది. ఎంతో మనో వేదనకు గురయ్యారు. దీంతో సబిల్‌ను హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 21న మాట్లాడుదాం రమ్మని సబిల్‌ పిలిపించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. మగ్దుంపూర్ శివారులోకి రాగానే సబిల్‌ని హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సబిల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മണ്ഡല പുനര്‍നിര്‍ണയത്തില്‍ സീറ്റുകള്‍ കുറഞ്ഞാലും കുഴപ്പമില്ല; രാജ്യസഭയെ യു.എസ് സെനറ്റ് മാതൃകയിലാക്കണമെന്ന് കെ. കവിത

  ഹൈദരാബാദ്: രാജ്യത്ത് മണ്ഡല പുനര്‍നിര്‍ണയം നടപ്പിലാക്കുമ്പോള്‍ ഉണ്ടാകാന്‍ സാധ്യതയുള്ള ഫെഡറല്‍...

ஈரான் Lock ஆன '5' விஷயங்கள்: ஹார்முஸ் ஜலசந்தியை அமெரிக்கா முற்றுகையிட்டதன் விளைவு!

ஈரான் - அமெரிக்கா போர் இன்னும் முடிந்தபாடில்லை. அமெரிக்காவிற்கு நெருக்கடி கொடுக்க...

Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో...

ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಬಿಕ್ಕಟ್ಟು ಬಗೆಹರಿದ ಬಳಿಕ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ದರ ಇಳಿಕೆ- ಕೇಂದ್ರ ಸಚಿವ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಶಿ

ದಾವಣಗೆರೆ,ಮೇ,2,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ, ಹೋರ್ಮಜ್ ಜಲಸಂಧಿ ಬಿಕ್ಕಟ್ಟಿನಿಂದ ಗ್ಯಾಸ್...