3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

Supreme Court: “హైకోర్టు తప్పు చేసింది”.. యాక్టర్ దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు..

Date:

Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.

కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘ప్రాథమిక దృష్టితో కూడిన న్యాయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం’’ అని విమర్శించింది. దర్శన్ తూగదీపకు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టును సుప్రీంకోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేయడంలో విచక్షణ ఉపయోగించడంలో విఫలమైందని గత వారం హైకోర్టుకు చెప్పింది.

Read Also: HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..

గురువారం మధ్యాహ్నం జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమని చెప్పింది. హత్య కుట్ర కేసు కాబట్టి మేము దీనిపై కొంచెం తీవ్రంగా ఉన్నామని చెప్పింది. హైకోర్టు డిసెంబర్ 2024 బెయిల్ ఆర్డర్‌లోని భాషపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో సహా మొత్తం 13 మంది నిందితులు ఉన్నారు. దర్శన్ స్నేహితురాలు పవిత్రగౌడకకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే ఆరోపణలతో రేణుకాస్వామి హత్య జరిగింది. రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న మురుగునీటి కాలువలో కనుగొన్నారు. రేణుకాస్వామి కిడ్నాప్‌లో పాల్గొన్న నలుగురికి దర్శన్ రూ. 50 లక్షలు ఇచ్చాడని పోలీసులు భావిస్తున్నారు. అపహరణ, హత్యకు సంబంధించిన అన్ని అంశాలను నిర్వహించడానికి, అలాగే మృతదేహాన్ని పారవేయడానికి ప్రదోష్ (అలియాస్ పవన్) అనే వ్యక్తికి రూ. 30 లక్షలు ఇందులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. హత్య , మృతదేహాన్ని పడవేయడంలో సాయం చేసిన నిఖిల్, కేశవమూర్తికి రూ. 5 లక్షలు చొప్పున ఇచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മണ്ഡല പുനര്‍നിര്‍ണയത്തില്‍ സീറ്റുകള്‍ കുറഞ്ഞാലും കുഴപ്പമില്ല; രാജ്യസഭയെ യു.എസ് സെനറ്റ് മാതൃകയിലാക്കണമെന്ന് കെ. കവിത

  ഹൈദരാബാദ്: രാജ്യത്ത് മണ്ഡല പുനര്‍നിര്‍ണയം നടപ്പിലാക്കുമ്പോള്‍ ഉണ്ടാകാന്‍ സാധ്യതയുള്ള ഫെഡറല്‍...

ஈரான் Lock ஆன '5' விஷயங்கள்: ஹார்முஸ் ஜலசந்தியை அமெரிக்கா முற்றுகையிட்டதன் விளைவு!

ஈரான் - அமெரிக்கா போர் இன்னும் முடிந்தபாடில்லை. அமெரிக்காவிற்கு நெருக்கடி கொடுக்க...

Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో...

ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಬಿಕ್ಕಟ್ಟು ಬಗೆಹರಿದ ಬಳಿಕ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ದರ ಇಳಿಕೆ- ಕೇಂದ್ರ ಸಚಿವ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಶಿ

ದಾವಣಗೆರೆ,ಮೇ,2,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ, ಹೋರ್ಮಜ್ ಜಲಸಂಧಿ ಬಿಕ್ಕಟ್ಟಿನಿಂದ ಗ್ಯಾಸ್...