4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

Lashkar-e-Taiba: “పహల్గాం దాడి”కి పాల్పడిన ఉగ్రసంస్థ తన స్థావరాన్ని మార్చుతోంది.. ఎందుకంటే..

Date:

Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్ఎఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబాతో పాటు టీఆర్ఎఫ్ రెండూ కూడా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని మురిడ్కే నుంచి దాదాపు 400 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్‌కు మారుస్తున్నట్లు సమాచారం.

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ మురిడ్కే లోని లష్కరే స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడి చేసింది. బహవల్పూర్‌లోని జైషే హెడ్‌క్వార్టర్‌పై కూడా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. ప్రస్తుతం, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు కూడా ఒకే చోట తమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ సైన్యం చర్యలను భారత నిఘా వర్గాలు పర్యవేక్షిస్తున్నాయి.

Read Also: CM Revanth Reddy : భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఏర్పాటైంది. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం పనిచేసే ఓ తిరుగుబాటు సంస్థగా తనను తాను చెప్పుకుంది. ఈ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. కాశ్మీరేతరులు, సాధారణ కూలీలను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. ఆ తర్వాత, సైన్యం, పౌరులపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇది ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సంస్థల నుంచి తప్పించుకోవడానికి, అంతర్జాతీయ నిషేధాన్ని నివారించడానికి తిరుగుబాటు అనే ముసుగును ధరించింది.

పహల్గామ్ దాడి పాకిస్తాన్ స్వదేశీ తిరుగుబాటు ముసుగులో కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాద సంస్థలకు రీబ్రాండ్ చేయడం, స్థానిక పోరాటం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడటం వంటి వ్యూహాలను పాకిస్తాన్ రూపొందించింది. ఇలాంటి చర్యలకు టీఆర్ఎఫ్ ఒక ఉదాహరణ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ సైన్యం సూచనల మేరకు, ముఖ్యంగా ఆసిమ్ మునీర్‌ ప్రత్యక్ష సూచనలతో పనిచేస్తుందని భారత్ గుర్తించింది. పాకిస్తాన్‌లో అశాంతి, తనపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మునీర్ పహల్గామ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രി ഫേസ്ബുക്ക് ബയോ തിരുത്തിയത് ഇന്നല്ല, വോട്ടെണ്ണല്‍ കാരണവുമല്ല; പി.ബി അംഗമെന്ന് മാറ്റിയത് മാര്‍ച്ച് 16ന്

തിരുവനന്തപുരം: വോട്ടെണ്ണലിന് തൊട്ടുമുമ്പ് മുഖ്യമന്ത്രി പിണറായി വിജയന്‍ തന്റെ ഫേസ്ബുക്ക് ബയോ തിരുത്തിയെന്ന...

"சாவர்க்கர் ஆங்கிலேய அரசுக்கு கருணை மனுக்களை எழுதியது உண்மை; ஆனால்…" – சாவர்க்கரின் கொள்ளு பேரன்

லண்டனில் கடந்த 2023-ஆம் ஆண்டு ஆற்றிய உரையில், சாவர்க்கர் குறித்து அவதூறாகப்...

KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుస విజయాలతో దూసుకుపోతోంది....

‘അവര്‍ ഇനിയും മതിയായ വില നല്‍കിയിട്ടില്ല’; ഇറാന്റെ പുതിയ സമാധാന കരാറും തള്ളി ഡൊണാള്‍ഡ് ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ടെഹ്റാന്‍ മുന്നോട്ടുവെച്ച പുതിയ സമാധാന കരാറും അംഗീകരിക്കാന്‍ സാധ്യതയില്ലെന്ന സൂചനയുമായി...