5
May, 2026

A News 365Times Venture

5
Tuesday
May, 2026

A News 365Times Venture

Robbery: ఆలయాల్లో వరుస చోరీల కేసు ఛేదించిన పోలీసులు

Date:

Robbery: ఆ దొంగలకు ఆలయాలే టార్గెట్. అక్కడ ఉన్న పంచలోహ విగ్రహాలు.. బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. పోలీసులకు దొరక కుండా తప్పించుకుని వెళ్లిపోతారు. ఇలా చోరీ చేసిన విగ్రహాలను ముంబై, చెన్నై స్మగ్లర్లకు అమ్మేస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతుండడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో నిందితులు పట్టుబడ్డారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీల కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు… దాదాపు ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఆలయాల్లో జరుగుతున్న చోరీలు పోలీసులను కలవరపాటుకు గురి చేశాయి. ఎంతగా దర్యాప్తు చేస్తున్నా.. దొంగలు పట్టుబడలేదు. కానీ సాంకేతిక ఆధారాలు, ఇతర అంశాలను ఆధారం చేసుకుని చివరకు కేసును ఛేదించారు.. ఈ కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5,36,300 విలువైన పంచలోహ విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వరుసగా దేవాలయాల్లో చోరీలు పాల్పడుతున్న నిందితులను ఆంధ్రకు చెందిన పాత నేరస్తులని అధికారులు తేల్చారు…

ఈ దొంగలు ఇద్దరిని కే. శివానంద, షేక్ హమ్ షరీఫ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు కర్నూల్, ప్రకాశం జిల్లాలకు చెందిన వలస కార్మికులని చెబుతున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆలయాలపై చోరీలకు పాల్పడ్డట్లు తెలిపారు. శివానందపై గతంలో కాజీపేట్, మీర్‌పేట్, నాగోల్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఫిబ్రవరి 27 నుండి జూన్ 30 మధ్య కాలంలో యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఆరు ఆలయాల్లో చోరీలు చేశారని విచారణలో తేలింది. దొంగతనం చేసిన తర్వాత విగ్రహాలను ఉప్పల్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి శివకుమార్‌కు అమ్మేశారు.. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆలయాల నుంచి దొంగిలించిన పంచలోహ విగ్రహాలను చెన్నై, ముంబైలోని స్మగ్లర్లకు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి విదేశాలకు కూడా ఈ పంచలోహ విగ్రహాలు వెళ్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు…

Off The Record: బీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ కలుపు తీసే పనిలో బిజీగా ఉన్నారా..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

2024ല്‍ 11 സീറ്റ്, 2026ലേക്കെത്തിയപ്പോള്‍ മൂന്ന്; ‘ജയിച്ച സീറ്റിലും തോറ്റ്’ ബി.ജെ.പി

  കോഴിക്കോട്: 2025 തദ്ദേശ തെരഞ്ഞെടുപ്പിന് പിന്നാലെ 2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിലും...

தேர்தல் முடிவுகள்: தவெக `மிஸ்' செய்த மாவட்டங்கள் – முழு விவரம் இதோ!

நடந்து முடிந்த சட்டமன்றத் தேர்தலில், தமிழக வெற்றிக் கழகம் எனும் பேரலையில்...

Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ మొండికేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.....

ಒಡೆಯರ್ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್‌ ರೈಲು ನಿಲುಗಡೆ : ಜನರ ದಶಕಗಳ ಕನಸು ನನಸು- ಸಂಸದ ಡಾ ಸಿ ಎನ್ ಮಂಜುನಾಥ್.

ರಾಮನಗರ,ಮೇ,5,2026 (www.justkannada.in):  ಬೆಂಗಳೂರು–ಮೈಸೂರು ನಡುವಿನ ಒಡೆಯರ್ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ ರೈಲಿಗೆ ರಾಮನಗರ...