27
September, 2026

A News 365Times Venture

27
Sunday
September, 2026

A News 365Times Venture

Vallabhaneni Vamsi: సుప్రీం కోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

Date:

సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం విచారించిన ధర్మాసనం.. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని తెలిపింది. సీల్డ్ కవర్‌లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. రూ.195 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని న్యాయవాది గుర్తుచేశారు. సీల్డ్ కవర్‌లో నివేదిక ఇస్తామని న్యాయవాది నివేదించారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 16కు న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Thammudu : శిరీష్ నోటి ఫలితం.. ‘తమ్ముడు’కి తిప్పలు తెచ్చింది

ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. చివరిగా మంగళవారం నకిలీ పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. దీంతో బుధవారం వంశీ జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఇక ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు జైలుకు తరలిరానున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Xi Jin ping: అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మిస్సింగ్.. చైనాలో కలకలం

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗ്യാനേഷ് കുമാറിനെതിരായ രാജ്യവ്യാപക പ്രതിഷേധം; സി.ജെ.പിക്ക് പിന്തുണ പ്രഖ്യാപിച്ച് സോനം വാങ്ചുക്ക്

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് കോക്രോച്ച്...

''ஜெம் வீரமணியால் என் மகள் தற்கொலை செய்துகொண்டாள்!"- 10 ஆண்டுகளுக்குப் பிறகு தாய் அதிர்ச்சி புகார்

ஜெம் கிரானைட் அதிபர் வீரமணி மீதான போக்சோ வழக்கு தமிழகத்தையே உலுக்கி...

OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

OTR: తెలంగాణ బీజేపీ ఫోకస్‌ షిఫ్ట్‌ అవుతోందా? తాత్కాలికంగా కార్యక్షేత్రం మారబోతోందా?...

ട്രംപ്-ഷി കൂടിക്കാഴ്ച: വ്യാപാര യുദ്ധത്തിന് താത്ക്കാലിക ശമനം; 30 ബില്യണ്‍ ഡോളറിന്റെ താരിഫ് ഇളവിന് ധാരണ

വാഷിങ്ടണ്‍: അമേരിക്കയും ചൈനയും തമ്മിലുള്ള വ്യാപാര സംഘര്‍ഷത്തിന് താത്ക്കാലിക ശമനമെന്ന് റിപ്പോര്‍ട്ട്....