26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Crime News Today: జగ్గయ్యపేటలో దారుణం.. కొడుకుని కడతేర్చిన తండ్రి!

Date:

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని కన్న తండ్రే కడతేర్చాడు. సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో కసాయి కొడుకుని తండ్రి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…

Also Read: AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన!

గోళ్ల వెంకటనారాయణ (35)కు 15 ఏళ్ల క్రితం కృష్ణ కుమారితో వివాహం అయింది. అతడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్య కృష్ణ కుమారి వదిలేసి వెళ్లిపోవడంతో.. వెంకటనారాయణ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. వెంకటనారాయణ గత కొన్ని రోజులుగా మద్యం తాగి తల్లిదండ్రులపై దాడి చేస్తున్నాడు. కుమారుడి ప్రవర్తనపై తల్లిదండ్రులు విసుగు చెందారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బాగా మందు తాగి వచ్చిన వెంకటనారాయణ.. తల్లిదండ్రులను కొట్టాడు. ఈ క్రమంలో తండ్రి గోళ్ల కృష్ణ కుమారుడిని చెక్క మొద్దుతో కొట్టాడు. దాంతో వెంకటనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്ത്യയുമായുള്ള സംഘര്‍ഷത്തില്‍ സമയോചിതമായ ഇടപെടലിന് ട്രംപിനോട് നന്ദി പറഞ്ഞ് പാക് പ്രധാനമന്ത്രി

ന്യൂയോര്‍ക്ക്: 2025ലെ ഇന്ത്യയുമായുള്ള സംഘര്‍ഷത്തില്‍ യു.എസ് പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ് ട്രംപിന്റെ ‘സമയോചിതമായ...

“தீவிரவாத நாடு, என்னிடம் கேள்வி கேட்கிறீர்களா?" – பாக்., ஊடகவியலாளர் கேள்விக்கு அமைச்சர் ஜெய்சங்கர்

நியூயார்க்கில் ஐநா பொதுச் சபையின் 81-வது கூட்டத்தொடர் நடைபெற்றது. இந்தக் கூட்டத்...

ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..

ADR Report: 2022-2026 మధ్య కాలం నాలుగేళ్లలో పార్లమెంట్, అసెంబ్లీలకు గెలిచిన...

ദല്‍ഹിയില്‍ ഭജന്‍ ക്ലബ്ബിങ്ങില്‍ പങ്കെടുത്ത് മോദി; വിമര്‍ശനവുമായി ദീപ്‌കെ

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയില്‍ ഭജന്‍ ക്ലബ്ബിങ്ങില്‍ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി പങ്കെടുക്കുന്നതിന്റെ വീഡിയോ...