25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం..

Date:

CM Chandrababu: ఆదివారం రోజు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుండి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది.. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయనున్నారు.. అయితే, ఈ కార్యక్రమం ఎలా ఉండాలి..? ప్రజలకు ఎలాంటి విషాలు వెల్లడించాలి.. కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఏంటి..? చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి.. తదితర అంశాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్..

Read Also: Samantha : అలా చేసే దమ్ముందా.. చెత్త కామెంట్స్ చేయకండి

కాగా, చేసింది చెప్పడం. చేయవలసింది వివరించడం. ఇదే కాన్సెప్ట్‌తో జనం బాట పడుతోంది టీడీపీ. టీడీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి కార్యాచరణ రెడీ చేసుకుటున్నారు. ఏడాది పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. జులై మొదటివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధినేత చంద్రబాబు… నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కూడా ఇంటింటికీ నేతలు వెళ్లే కార్యక్రమంపై ప్రధానంగా చర్చ జరగనుంది. జనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటే మంచిదనే ఆలోచనలో ఉన్నారట నేతలు.. ఏడాది పాలనలోనే అన్ని జరిగిపోయాయని చెప్పడం లేదని మొన్న కూటమి సమావేశంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే… చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇదే ఇప్పుడు జనంలోకి వెళ్లి చెప్పనున్నారు ఎమ్మెల్యేలు. ఈ ఏడాది కాలంలో ఏ ఏ పథకాలు అమలు జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు. ఇలా ప్రతి అంశాన్ని జనానికి క్షుణ్ణంగా వివరించాలని, అవసరమైతే అన్ని వివరాలతో కూడా పాంప్లెంట్స్‌ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారని సమాచారం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അദാനി കേസ്: മലയാളി മാധ്യമപ്രവര്‍ത്തകന്‍ രവി നായര്‍ക്ക് ഏഴ് ദിവസത്തിന് ശേഷം ജാമ്യം

അഹമ്മദാബാദ്: മലയാളി മാധ്യമ പ്രവര്‍ത്തകന്‍ രവി നായര്‍ക്ക് ജാമ്യം. അദാനി എന്റര്‍പ്രൈസസിന്റെ...

தேர்தல் ஆணையம் விவகாரம்: “ஞானேஷ்குமார் அப்ரூவராக மாற வேண்டும்" – ராகுல் காந்தி

தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் உடனடியாக தனது பதவியை ராஜினாமா...

ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన నూతన ప్లేయర్...

ആര്‍.എസ്.എസില്‍ ചേര്‍ന്നാല്‍ ആരോഗ്യപ്രശ്‌നങ്ങള്‍ മാറ്റാം: സുവേന്ദു അധികാരി

കൊല്‍ക്കത്ത: ശാരീരിക ബുദ്ധിമുട്ടുകള്‍ അനുഭവിക്കുന്നവര്‍ ആര്‍.എസ്.എസ് ശാഖകളില്‍ ചേര്‍ന്ന് ആരോഗ്യം വീണ്ടെടുക്കണമെന്ന്...