26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Hyderabad: నార్సింగ్ లో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. నైజీరియన్ తో పాటు ఇద్దరు లోకల్ పెడ్లర్స్ అరెస్ట్

Date:

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. తాజగా నార్సింగ్ లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేశారు. రూ. 30 లక్షల విలువైన ఎస్టసీ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక నైజీరియన్ తో పాటు.. ఇద్దరు లోకల్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. మణికొండ లో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా డ్రగ్స్ దందాకు తెరలేపారు. ముఠా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు. విస్డం ఒనేకా, మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేష్, వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Harish Rao: కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

నైజీరియన్ వ్యక్తి నకిలీ పాస్‌పోర్ట్ తో హైదరాబాద్ లో ఉంటున్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. మొయినాబాద్ పరిధి అజీజ్ నగర్ లోని ఫాం హౌజ్ లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది ముఠా. మే 31న మంగళగిరిలో ఫణి రాజ్ అనే వ్యక్తికి 15 గ్రాముల కొకైన్ సరఫరా చేశారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్నవారిని గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ వినియోగదారులు ఫణి రాజ్, పవిత్ర రెడ్డి, సతీష్, సదా శివ, సుధీర్, భానుగా పోలీసులు గుర్తించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ದಸರಾ ದೀಪಾಲಂಕಾರ ಹೆಚ್ಚು ಆಕರ್ಷಕ, ಹೊಸತನದಿಂದ ಕೂಡಿರಲಿ -ಸಚಿವ ಕೆ.ಜೆ.ಜಾರ್ಜ್

ಮೈಸೂರು, ಸೆಪ್ಟಂಬರ್‌,25, 2026 (wwww.justkannada.in) ನಾಡಹಬ್ಬ ಮೈಸೂರು ದಸರಾ ಅಂಗವಾಗಿ...

സയണിസം വംശീയത; ഇസ്രഈലിനെ എതിര്‍ക്കുന്നത് ജൂത വിരുദ്ധതയല്ലെന്ന് ജൂത സമുദായാംഗമായ ഗ്രീന്‍ പാര്‍ട്ടി നേതാവ്

ലണ്ടന്‍: സയണിസം ഒരുതരം വംശീയതയാണെന്നും താന്‍ ഒരു സയേണിസ്റ്റ് വിരുദ്ധനാണെന്നും ബ്രിട്ടനിലെ...

எல்லா நாடுகளுக்கும் உடனடி தேவை 'இது' தான்… "7 நாள்களில் ஹார்முஸ்.!" குட் நியூஸ் சொல்கிறதா ஈரான்?

ஹார்முஸ் நீர்ச்சந்தி விரைவில் திறக்கப்படுகிறது போலும். அதற்கான அனைத்து பாசிட்டிவ் சிக்னல்களும்...

Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!

ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...