18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Miss World 2025: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న థాయ్‌లాండ్ భామ సుచతా

Date:

ప్రపంచ సుందరి కిరీటాన్ని థాయ్‌లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 72వ విజేతగా ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. ఇక రన్నరప్‌గా ఇథియోపియా భామ నిలిచింది. మూడో స్థానంలో పోలెండ్, నాల్గో స్థానంలో మార్టినిక్ భామ నిలిచింది.

Miss World 2025

ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. ఇందులో 16 మంది క్వార్టర్స్‌కు ఎంపికయ్యారు. చివరి రౌండ్‌లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు వచ్చిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయనిర్ణేతలు మిస్‌ వరల్డ్‌ విజేతను ప్రకటించారు. మొత్తానికి థాయ్‌లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించారు.

ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టాలీవుడ్, బాలీవుడ్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 3,500 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక న్యాయ నిర్ణేతలుగా నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ ఉన్నారు.

భారత్‌కు 6 సార్లు కిరీటం..
ఇక ఇప్పటి వరకు అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కిరీటం ఇండియా, వెనిజులా దక్కించుకున్నాయి. భారత్‌కు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ సొంతం చేసుకున్నారు. అలాగే వెనిజులా కూడా ఆరు సార్లు కిరీటం దక్కించుకుంది. యూకే 5 సార్లు, యూఎస్ఏ, సౌతాఫ్రికా చెరో 3 సార్లు కిరీటం సొంతం చేసుకున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

JDS ಬಿಡುವ ಪ್ರಶ್ನೆಯೇ ಇಲ್ಲ- ಶಾಸಕ ಜಿ.ಟಿ ದೇವೇಗೌಡ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ನಾನು ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷದಲ್ಲೇ ಇದ್ದೇನೆ. ಜೆಡಿಎಸ್ ಬಿಡುವ...

ആരെയൊക്കെ വധിച്ചാലും ഇറാന്‍ ദുര്‍ബലപ്പെടില്ല, വ്യക്തികളെ ആശ്രയിച്ചല്ല ആ സംവിധാനം നിലനില്‍ക്കുന്നത്: അരാഗ്ചി

ടെഹ്റാന്‍: യു.എസും ഇസ്രാഈലും ചേര്‍ന്ന് നടത്തുന്ന കൊലപാതകങ്ങള്‍ കൊണ്ട് ഇറാന്റെ ശക്തമായ...

ஹார்முஸில் 5,000 பவுண்ட் வெடிகுண்டு: யாரும் உதவிக்கு வரவில்லை; 'தானே' களத்தில் இறங்கிய அமெரிக்கா

அமெரிக்காவும், இஸ்ரேலும் தங்களுக்கு எதிராக தொடுத்துள்ள போருக்கு ஈரானின் முக்கிய எதிர்வினை...

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...