18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Israel: హమాస్ కొత్త చీఫ్ ముహమ్మద్ సిన్వర్‌ హతం.. నెతన్యాహు ప్రకటన

Date:

హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్ర నాయకులందరినీ హతమార్చింది. తాజాగా ప్రస్తుత హమాస్ గాజా చీఫ్ ముహమ్మద్ సిన్వర్‌ను కూడా చంపేసినట్లుగా బుధవారం అధికారికంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ముహమ్మద్ సిన్వర్‌ మరణాన్ని అధికారికంగా ధృవీకరించారు. 2024, అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే ముహమ్మద్ సిన్వర్‌. యాహ్యా సిన్వర్ హతమయ్యాక ముహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు. ఇతడు 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడికి కుట్రదారుడిగా ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Harvard: కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై ట్రంప్ చర్యలు.. సోషల్‌ మీడియాలో చర్చ

మే 14న ఐడీఎఫ్ దళాలు జరిపిన భారీ వైమానిక దాడిలో ముహమ్మద్ సిన్వర్ చనిపోయినట్లు నివేదికలు అందాయి. కానీ పూర్తి క్లారిటీగా మరణాన్ని ధృవీకరించలేకపోయారు. ఆ సమయంలో తీవ్రంగా గాయపడినట్లుగా ఐడీఎఫ్ భావించింది. తాజాగా మరణాన్ని అధికారికంగా నిర్ధారించింది. మే 14న ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడి చేసినప్పుడు ఉగ్రవాద సంస్థ కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న భూగర్భ కేంద్రంలో ఉన్నాడు. ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద ఈ కమాండ్ సెంటర్ ఉంది. ఇజ్రాయెల్ సైన్యం ఖచ్చితమైన దాడి తర్వాత జరిగిన పరిణామాల వీడియోను విడుదల చేసింది. దీనిలో ఆసుపత్రి కింద ఒక సొరంగం మార్గం ఉంది. ఆ సమయంలో ముహమ్మద్ సిన్వర్ ఇక్కడ్నే ఉన్నాడు. పక్కా ప్లాన్‌తో దాడి చేయడంతో చనిపోయాడు. కానీ అప్పుడు క్లారిటీ రాలేదు.

ఇది కూడా చదవండి: Minister Nimmala: ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చేసింది.. చేయబోయేది తెలుగుదేశమే

తాజాగా ముహమ్మద్ సిన్వార్‌ను తొలగించినట్లు ప్రధాన మంత్రి నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ వేదికపై నుంచి ప్రకటించారు. మేము ఇస్మాయిల్ హనియే, మొహమ్మద్ దీఫ్, యాహ్యా సిన్వార్, ఇప్పుడు ముహమ్మద్ సిన్వార్‌లను తొలగించినట్లు వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೃತ ಮೂವರು ರಿಸರ್ವ್ ಸಬ್ ಇನ್ಸ್‌ಪೆಕ್ಟರ್‌ ಗಳ ಕುಟುಂಬಕ್ಕೆ ಪರಿಹಾರ ಘೋಷಿಸಿದ ಸಿಎಂ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in): ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯ ಚಳ್ಳಕೆರೆ ತಾಲ್ಲೂಕಿನ ಹೆಗ್ಗೆರೆ ಗೇಟ್...

ഭീരുത്വപരമായ വധം; ഇറാന്‍ ഇന്റലിജന്‍സ് മന്ത്രി കൊല്ലപ്പെട്ടെന്ന് സ്ഥിരീകരിച്ച് പെസസ്‌കിയാന്‍

ടെഹ്‌റാന്‍: ഇറാന്റെ ഇന്റലിജന്‍സ് മന്ത്രി എസ്മായില്‍ ഖത്തീബ് കൊല്ലപ്പെട്ടെന്ന് സ്ഥിരീകരിച്ച് ഇറാന്‍...

தவெக: "நான் முதல் மாநாட்டுல சொன்ன மாதிரிதான்" – கூட்டணி சர்ச்சைகளுக்கு விஜய்யின் விளக்கம் என்ன?

தமிழக வெற்றிக் கழகத்தின் இஃப்தார் நோன்பு திறக்கும் நிகழ்வு இன்று மகாபலிபுரத்திலுள்ள...

Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

Story Board: హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అసలు...