5
May, 2026

A News 365Times Venture

5
Tuesday
May, 2026

A News 365Times Venture

PM Modi: పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్

Date:

మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. కేంద్రం త్రివిధ దళాలకు పూర్తి స్వచ్ఛ ఇచ్చిందని గుర్తుచేశారు. మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేసినట్లు మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Jaishankar: కాల్పుల విరమణపై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన జై శంకర్

మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులతో అనుబంధంగా ఉన్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం ఐక్యంగా ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 140 కోట్ల మంది భారతీయులను కదిలించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెపై దాడి చేశామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నివ్వడంతోనే ఇదంతా జరిగిందని మోడీ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ సమస్యను నేనే పరిష్కరించా.. ట్రంప్ మళ్లీ ప్రకటన

Modi

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని.. మతం ఆధారంగా వేరు చేసి.. మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేశారని.. దానికి ప్రతీకారంగానే మన దళాలు వాళ్లను మట్టిలో పాతిపెట్టేశారన్నారు. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గాయపరిచారు.. అందుకే వాళ్లను ముక్కలు.. ముక్కలు చేశామని వెల్లడించారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదుల శిబిరాలు నాశనం అయినట్లు చెప్పారు. త్రివిధ దళాల దెబ్బకు పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇక అణు బాంబుల భయానికి భారతదేశం వెనుకాడదని మరోసారి మోడీ స్పష్టం చేశారు.

ఇక అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్‌ భారత్‌ స్టేషన్లను రాజస్థాన్‌ నుంచి వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు. కొత్త స్టేషన్లను జాతికి అంకితమిచ్చారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఏపీలోని సూళ్లూరుపేట అమృత్‌ భారత్‌ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు.యూపీలో 19, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 అమృత్‌ భారత్‌ స్టేషన్లను ప్రారంభించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തരംഗത്തിലും ഇടതിന് കാലിടറാതെ നാട്ടിക

തൃശ്ശൂർ: ശക്തമായ പോരാട്ടത്തിനൊടുവിൽ നാട്ടിക മണ്ഡലം നിലനിർത്തി എൽ.ഡി.എഫ്. തെരഞ്ഞെടുപ്പ് പ്രഖ്യാപനം...

'சந்திரபாபு நாயுடுவை இறக்கிய என்.டி.ஏ' – ஒரே ரவுண்டில் ஆனந்துக்கு தி.நகரை வென்று கொடுத்த விஜய்!

தவெகவின் பொதுச் செயலாளர் புஸ்ஸி ஆனந்த் தி.நகர் தொகுதியில் கிட்டத்தட்ட 13,000...

TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

TPCC Mahesh Goud : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని...

ಮೈಸೂರು: ಮೇ 8ರಿಂದ ಚರಕದ ಕೈಮಗ್ಗ ಉತ್ಪನ್ನಗಳ ಪ್ರದರ್ಶನ, ಮಾರಾಟ

ಮೈಸೂರು,ಮೇ,4,2026 (www.justkannada.in): ಇಲ್ಲಿನ ವಿಜಯನಗರದ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಪರಿಷತ್ ರಸ್ತೆಯಲ್ಲಿನ...