25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

Operation Sindoor: పాక్‌లో ధ్వంసమైన ప్రాంతాలివే.. ఉపగ్రహ చిత్రాలు విడుదల

Date:

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడింది. భారత్ కొట్టిన దెబ్బకు దాయాది దేశం వణికిపోయింది. దెబ్బకు శుత్ర దేశం కాళ్ల బేరానికి వచ్చింది. అంతగా పాకిస్థాన్ హడలెత్తిపోయింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్‌లో ఏఏ ప్రాంతాలు ధ్వంసమయ్యాయో.. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి.

ఇది కూడా చదవండి: Kolkata: కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. హై అలర్ట్‌ ప్రకటన

భారత్ చేపట్టిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో హ్యాంగర్లు, రన్‌వేలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రన్‌వేలపై గుంటలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన చిత్రాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులకు తెగబడింది.

ఇది కూడా చదవండి: Khawaja Asif: ఇంగ్లీష్ రాకుంటే ఎందుకు మీడియా ముందుకు..? పాక్ రక్షణ మంత్రి కామెడీ మామూలుగా లేదు..

అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీతో తీసిన హై-రిజుల్యూషన్ చిత్రాలు బయటకు వచ్చాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, సింద్‌లోని సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్ వంటి వైమానిక సైనిక స్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చిత్రాల్లో భారీగా నష్టం జరిగినట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సింధ్‌లోని షాబాజ్ జకోబాబాద్, ఉత్తర తట్టాలోని భోలారి ప్రాంతాలు ఉన్నాయి.

P2

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ముందే పురుషులను కాల్చి చంపేశారు. దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఎలాగైనా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దీంతో మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌పై భారత వాయుసేన మెరుపుదాడులు చేసింది. దీంతో నూర్‌ ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసం అయింది. అంతేకాకుండా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించింది.

P3

P4

P5

P6

P7

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ആര്‍.എസ്.എസില്‍ ചേര്‍ന്നാല്‍ ആരോഗ്യപ്രശ്‌നങ്ങള്‍ മാറ്റാം: സുവേന്ദു അധികാരി

കൊല്‍ക്കത്ത: ശാരീരിക ബുദ്ധിമുട്ടുകള്‍ അനുഭവിക്കുന്നവര്‍ ആര്‍.എസ്.എസ് ശാഖകളില്‍ ചേര്‍ന്ന് ആരോഗ്യം വീണ്ടെടുക്കണമെന്ന്...

வீரமணி வழக்கு: `யாரையும் காப்பாற்ற எந்த உத்தரவும் கழக ஆட்சியில் பிறப்பிக்கப்படவில்லை' – ஸ்டாலின்

வீரமணி போக்சோ வழக்கில் அவருக்கு உடந்தையாக இருந்தவர்கள், அவரைக் காப்பாற்ற முயன்றவர்கள்...

2500 മുസ്‌ലിം വോട്ടര്‍മാരുടെ പേര് വെട്ടാന്‍ ബി.ജെ.പി എം.എല്‍.എ തെഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് കത്തെഴുതിയതായി കോണ്‍ഗ്രസ്

ബെംഗളൂരു: കര്‍ണാടകയിലെ പ്രമുഖ ബി.ജെ.പി എം.എല്‍.എ അഭയ് പാട്ടീല്‍ വോട്ടര്‍പട്ടികയില്‍ നിന്ന്...