13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Subbanna Ayyappan: నదిలో తేలిన పద్మశ్రీ గ్రహీత మృతదేహం.!

Date:

Subbanna Ayyappan: ప్రముఖ వ్యవసాయ జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ మృతదేహం కర్ణాటకలోని శ్రీరంగపట్న సమీపంలోని కావేరీ నదిలో లభ్యమైంది. ఈ విషాదకర సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. స్థానికులు నదిలో తేలియాడుతున్న శరీరాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించగా, అధికారులు దానిని వెలికితీసారు. మృతుడి ద్విచక్రవాహనం కావేరీ నది తీరాన నిలబెట్టిన స్థితిలో కనిపించడంతో.. ఆయనే స్వయంగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మృతికి గల కారణం పూర్తిగా దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.

Read Also: IPL In Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగకపోవడానికి అసలు కారణం ఇదే.?!

ఇక అయ్యప్పన్ వయస్సు 70 సంవత్సరాలు. ఆయన మైసూరు నగరంలోని విశ్వేశ్వర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్నారు. అయితే, అయ్యప్పన్ మే 7న నుండి కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి ధ్యానం కోసం వెళ్ళే అలవాటు ఆయనకు ఉండేదని పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Amritsar Spurious LiquorG: కాటికి పంపిన కల్తీ మద్యం.. 14 మంది మృతి

ఇక డాక్టర్ అయ్యప్పన్ భారత్‌లో ‘బ్లూ రివల్యూషన్’ (అక్వాకల్చర్ విప్లవం) సాధనలో కీలక పాత్ర పోషించారు. ICARకు క్రాప్ విభాగానికి సంబంధించిన కాకుండా మిగిలిన విభాగాల నుండి తొలిసారి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన శాస్త్రవేత్త అయ్యప్పన్. ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, సుబ్బన్న అయ్యప్పన్ మృతి గల కారణాల కోసం పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!

Heroes Body Transformation: ప్రస్తుతం టాలీవుడ్‌లో మేకోవర్ సీజన్ నడుస్తోంది. కొత్త...

ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ: ಸಂಭಾವ್ಯ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ...

ഇറാന്റെ വൈദ്യുതി സംവിധാനത്തെ തകര്‍ക്കുമെന്ന് ട്രംപ്; അരമണിക്കൂറിനുള്ളില്‍ മേഖലയെ മുഴുവന്‍ ഇരുട്ടിലാക്കുമെന്ന് ലാരിജാനി

ടെഹ്‌റാന്‍: ഇറാന്റെ വൈദ്യുതി സംവിധാനങ്ങളെ ആക്രമിച്ചാല്‍ അര മണിക്കൂറിനകം മേഖലയെ പൂര്‍ണമായും...