21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Attaullah Tarar : కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు.

Date:

Attaullah Tarar : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే, పాక్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత సాయుధ బలగాలు కఠినంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించిన అనంతరం, పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందిస్తూ—”పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయదు” అని స్పష్టం చేశారు. “ప్రజలు విజయోత్సవాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో అలాంటి చర్యలకు తావే లేదు. పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు,” అని ఆయన జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. భారత్ చేసిన ఆరోపణలు నిరాధారమని, ఇలాంటి విషయాల్లో బహిష్కరణ కాకుండా విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

RAPO 22 : రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.?

ఇక ఇదే అంశంపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కాల్పుల విరమణకు తాము అంకితమైనప్పటికీ, ఉల్లంఘనలు కొనసాగితే పాకిస్థాన్ బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. “డీజీఎంవోల మధ్య కుదిరిన అవగాహనకు పాకిస్థాన్ పదేపదే విఘాతం కలిగిస్తోంది. ఇది స్పష్టమైన ఒప్పంద ఉల్లంఘన. భారత సాయుధ బలగాలు తగిన విధంగా స్పందిస్తున్నాయి. ఇలాంటి చర్యలను మేము చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నాం,” అని మిస్రీ హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు మరియు ఎల్‌వోసీ వద్ద భారత బలగాలను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

Jayam Ravi : బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు .. స్టార్ హీరో వైఫ్ పోస్ట్ వైరల్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...

`இன்னும் பழைய அரசாங்கத்தையே குறைச் சொல்லிக்கொண்டிருப்பதில் நியாயமில்லை' – விஜய்யை சாடிய எல்.முருகன்

மத்திய இணை அமைச்சர் எல்.முருகன், வேலூரில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...

Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కరోజే సంచలనంగా మారిన యువ...

ಗಣೇಶೋತ್ಸವವನ್ನು ರಾಜಕೀಯ ಸಂಘರ್ಷದ ವೇದಿಕೆಯನ್ನಾಗಿಸಬಾರದು: ಎಚ್.ಎ. ವೆಂಕಟೇಶ್

  ಮೈಸೂರು, SEP.20,2026: ರಾಜ್ಯದಲ್ಲಿ ಗಣೇಶೋತ್ಸವ ಹಾಗೂ ವಿಸರ್ಜನಾ ಮೆರವಣಿಗೆಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ...