25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

Blue Drum: పెళ్లిలో వరుడికి గిఫ్ట్‌గా ‘‘బ్లూ డ్రమ్’’.. ఒక్కసారిగా అంతా షాక్..

Date:

Blue Drum: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్తని చంపేసి, డెడ్ బాడీని 15 ముక్కలుగా కట్ చేసి, ఒక బ్లూ కలర్ డ్రమ్‌లో పెట్టి, దానిని సిమెంట్‌తో కప్పేశారు. చివరకు సౌరభ్ ఫ్యామిలీ ఫిర్యాదుతో ఈ హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ‘‘బ్లూ డ్రమ్’’ అనేది భయానికి కేరాఫ్‌గా మారింది. ఎవరైనా బ్లూ కలర్ డ్రమ్ కొనుగోలు చేస్తే అనుమానపు చూపులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ హత్య వల్ల బ్లూ డ్రమ్ గిరాకీలు పడిపోయాయి. కొన్ని చోట్ల భార్యలు, తమ భర్తని చంపి బ్లూ కలర్ డ్రమ్‌లో బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.

Read Also: CM Revanth Reddy : జపాన్‌లో ఉద్యోగ అవకాశాలకు తెలంగాణ యువతకు వేదిక.. TOMCOM కీలక ఒప్పందాలు

ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ హమీర్ పూర్‌లో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు అతడికి ‘‘బ్లూ కలర్ డ్రమ్’’ గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. ఒక్కసారిగా ఈ ఘటనలో పెళ్లికి వచ్చిన వారు షాక్ అయ్యారు. పెళ్లికొడుకు సోదరులను ఇది భయపెట్టింది. బహుమిని చూసిన తర్వాత వరుడు షాక్ అవ్వగా, వధువు నవ్వు ఆపుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హమీర్‌పూర్‌లోని రత్ కొత్వాలి ప్రాంతం, మంగ్రౌల్ గ్రామానికి చెందిన శైలేంద్ర రాజ్‌పుత్ వివాహం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. అతను రిహుంటా గ్రామానికి చెందిన సీమాను వివాహం చేసుకుంటున్నాడు

దీనిపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. “బహుమతిని చూసిన తర్వాత వరుడు చాలా భయపడ్డాడు, కానీ వధువు నవ్వు ఆపుకోలేకపోయింది.” అంటూ ఒకరు కామెంట్ చేయగా, మరొకరు.. ఇప్పుడు నిజమైన పెళ్లి సరదా ప్రారంభమవుతుంది అని రాసుకొచ్చారు. మరొకరు, సోదరా ఈ గిఫ్ట్‌తో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്രസംഗം തുടങ്ങും മുന്‍പേ ഇറങ്ങിപ്പോയി പ്രതിനിധികള്‍; പരിഹസിച്ച് നെതന്യാഹു

ന്യൂയോര്‍ക്ക്: എതിരാളികളെയും സഖ്യകക്ഷികളെയും ഒരുപോലെ ആക്രമിച്ചുള്ള ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിന്റെ...

சாலை முதல் சாக்கடை வரை… முதல்வர் வருகைக்காக மாறும் மதுரை ராஜாஜி மருத்துவமனை சுற்றுப்புறம் | Photos

தாராபுரம்: "அதிமுக-திமுக கூட்டு சேர்ந்து எங்களுக்கு எதிராகச் சதி செய்கிறார்கள்" -...

Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు

Makkah Defence Pact: పాకిస్తాన్-సౌదీ అరేబియా-టర్కీలు కలిసి ‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’పై...

അദാനി കേസ്: മലയാളി മാധ്യമപ്രവര്‍ത്തകന്‍ രവി നായര്‍ക്ക് ഏഴ് ദിവസത്തിന് ശേഷം ജാമ്യം

അഹമ്മദാബാദ്: മലയാളി മാധ്യമ പ്രവര്‍ത്തകന്‍ രവി നായര്‍ക്ക് ജാമ്യം. അദാനി എന്റര്‍പ്രൈസസിന്റെ...