17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Crime News : మద్యం తాగించి.. అసభ్యకర ఫొటోలు తీసి.. రూ.46 లక్షలు వసూలు

Date:

Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ బెయిల్ చేసి ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. గతంలో విశ్రాంత ఉద్యోగి త్రిపురాం మండలం రాగడప బీట్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన ఆంగోత్‌ గణేశ్‌ ట్రాన్స్ ఫార్మర్ వైర్లను దొంగతనం చేస్తూ జల్సాలు చేసేవాడు. ఆ విషయం విశ్రాంత ఉద్యోగికి తెలియక అతనితో పరిచయం పెంచుకున్నాడు.

Read Also : Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?

గణేశ్ మంచి టైమ్ కోసం వెయిట్ చేసి.. ఓ రోజు విశ్రాంత ఉద్యోగికి పీకల దాకా మందు తాగించాడు. ఓ మహిళకు డబ్బులు ఇచ్చి విశ్రాంత ఉద్యోగితో రకరకాల అసభ్యకర భంగిమల్లో ఉంచి ఫొటోలు తీసుకున్నాడు. వాటిని చూపించి మీ ఫ్యామిలీకి చూపిస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజటం స్టార్ట్ చేశాడు. వేల నుంచి లక్షలు వసూలు చేశాడు. ముందు జాగ్రత్తతో డబ్బులు వడ్డీకి తీసుకున్నట్టుగా 19 ప్రామిసరీ నోట్ల మీద అధికారి సంతకాలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు.

ఓ రోజు వాటిని చూపించి అధికారి కూతురు, అల్లుడి వద్ద ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు. ఈ విషయంలో గణేశ్ కు అతని భార్య సహకరించింది. రీసెంట్ గా మరో రూ.3లక్షలు కావాలని ఇద్దరూ కలిసి వేధించారు. ఇక తన వల్ల కాదని ఆ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన కారుతో పాటు ప్రామిసరీనోట్లు, నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇറാനിലെ റാലികള്‍ എ.ഐ ആണെന്ന ട്രംപിന്റെ വാദം പെഹ്‌ലവിയുടേതിന് സമാനം; പരിഹസിച്ച് ലാരിജാനി

ടെഹ്‌റാന്‍: ഇറാനിലുടനീളം അടുത്തിടെയുണ്ടായ യു.എസ്-ഇസ്രഈലി വിരുദ്ധ പ്രതിഷേധങ്ങള്‍ എ.ഐ ഉപയോഗിച്ച് നിര്‍മിച്ചതാണെന്ന...

`அப்செட்டான ரஜினி; டெல்லி கொடுத்த சிக்னல்' – அறிக்கைக்கு பின்னால் நடந்த அரசியல்!

“காலம் பேசாது ஆனால் காத்திருந்து பதில் சொல்லும்”என்கிற வரிகளோடு ரஜினி வெளியிட்ட...

Jeevan Reddy: నేను పార్టీ వీడతానని సంజయ్‌కు చెప్పానా?.. మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టాడు!

తనతో కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు ఆఫర్...

ಸಿರ್ಸಿ ವೃತ್ತದಿಂದ ಮತ್ತೊಂದು ಮೇಲ್ಸೇತುವೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in):  ಚಾಮರಾಜಪೇಟೆ ಸಿರ್ಸಿ ಜಂಕ್ಷನ್‌ನಿಂದ ಬಿಎಚ್ ಇಎಲ್ ಕಿಮಕೋ...