24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా ఇంటి వాచ్‌మెన్‌ మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన రంగన్న భార్య

Date:

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిలో గతంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగన్న అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులు చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు.. అయితే, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకను హత్య చేసిన హంతకులను రంగన్న గుర్తించడంతో సీబీఐ విచారణ మొదలైంది. ఆ నలుగురే వివేకాను హత్య చేశారని గతంలో రంగన్న సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

Read Also: AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఆ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత..

ఇక, మృతుడు రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. నా భర్త రంగన్న అనారోగ్య సమస్యతో బాధపడేవారన్నారు.. గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు.. గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు.. అయితే, గత మూడు నెలల నుంచి నా భర్త చాలా మానసికంగా దెబ్బతిన్నాడు.. నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని వెల్లడింఆచరు.. నీవు వచ్చేలోపు నేను బ్రతుకుతానో లేదో అని నాతో అన్నాడని గుర్తుచేసుకున్నారు.. నా భర్తకు బాగాలేదని మా ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పారని.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.. ఇక, నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితోనే మృతి చెందాడని తెలిపారు వాచ్‌మెన్‌ రంగన్న భార్య సుశీలమ్మ..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗര്‍ബ നൃത്തത്തിന് വരുമ്പോള്‍ നിങ്ങളുടെ സഹോദരിമാരെയും പെണ്‍മക്കളെയും കൊണ്ടുവരൂ: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗ ഭീഷണിയുമായി ബി.ജെ.പി എം.എല്‍.എ

ഭോപാല്‍: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗഭീഷണിയുമായി ഭോപ്പാലിലെ ഹുസൂരില്‍ നിന്നുള്ള ബി.ജെ.പി എം.എല്‍.എ...

"எடப்பாடியுடன் கூட்டணி வைத்தால் துணை முதல்வர் பதவி என்றார் ஆதவ் அர்ஜுனா" – ரகசியம் பகிர்ந்த சீமான்

தாராபுரம் இடைத்தேர்தலில் நாம் தமிழர் கட்சி வேட்பாளராக களத்தில் உள்ள கார்த்திகாவை...

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం...

ഗ്യാനേഷ് കുമാറിനെ ജയിലിലടക്കണം; ബാലറ്റ് പേപ്പറുകള്‍ ഉപയോഗിച്ച് തെരഞ്ഞെടുപ്പുകള്‍ വീണ്ടും നടത്തണം: ഉദ്ധവ് താക്കറെ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി ശിവസേന (യു.ബി.ടി)...