15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

WhatsApp Governance: రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు.. దేశంలోనే మొదటి సారి

Date:

వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు.

READ MORE: Esther Anuhya Case: ఎస్తేర్ అనూహ్య హత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. చేతులెత్తేసిన పేరెంట్స్

దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని తెలిపారు. కాగా.. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది.

READ MORE: Minister Bhupathi Raju: రేపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ సందర్శనకు కేంద్ర మంత్రులు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ലുങ്കിവാല അധിക്ഷേപം: സ്വാതന്ത്ര്യദിനത്തില്‍ ലുങ്കിയുടുത്ത് പതാകയുയര്‍ത്തി വി.ടി ബല്‍റാം

പാലക്കാട്: സ്വാതന്ത്ര്യ ദിന ആഘോഷങ്ങള്‍ക്കിടെ ലുങ്കിയുടുത്ത് പതാകയുയര്‍ത്തി വി.ടി ബല്‍റാം എം.എല്‍എ....

விஜய் குறித்து நயினார் சர்ச்சைப் பேச்சு; "தாயை இழிவுபடுத்துவதை ஏற்க முடியாது" – சீறும் அண்ணாமலை

கமலாலயத்தில் நடந்த சுதந்திர தின விழாவில் பேசிய பாஜக மாநிலத் தலைவர்...

IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!

దేవదత్ పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఒసిసిపట్టుకుంటూ అద్భుతమైన...

‘കുറ്റവാളിമുക്ത പാർലമെന്റ് സമ്മാനമായി വേണം’; പ്രധാനമന്ത്രിയോട് ആവശ്യപ്പെട്ട് സോനം വാങ്ചുക്

ന്യൂഡൽഹി: ഈ സ്വാതന്ത്ര്യദിനത്തിൽ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയോട് ‘കുറ്റവാളിമുക്ത പാർലമെന്റ്’ സമ്മാനമായി...