5
December, 2025

A News 365Times Venture

5
Friday
December, 2025

A News 365Times Venture

Off The Record : మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కి తెరపడినట్టేనా..?

Date:

Off The Record : కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌ టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినట్టేనంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పిలిచి మాట్లాడాక ఎపిసోడ్ మొత్తం సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో సురేఖ… మురళి చేసిన లొల్లి కంటే….. వాళ్ళ కూతురు సుస్మిత చేసిన గొడవే పెద్ద రచ్చకు దారి తీసింది. పైగా ఇది బీసీ వర్సెస్‌ రెడ్లు టర్న్‌ అవుతోందన్న సంకేతాలు రావడం, ఓవైపు పార్టీ బీసీ నినాదం, మరోవైపు స్థానిక ఎన్నికల టైంలో వివాదాన్ని ఇంతకు మించి పెరగనీయకూడదని భావించారట పార్టీ పెద్దలు. అందుకే ఆఘమేఘాల మీద సెటిల్‌ చేసినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా ఇంటికి పోలీసులు వెళ్ళడాన్ని పార్టీలోని సీనియర్స్‌, కీలక నేతలు కొందరు కూడా తప్పు పట్టారట. మంత్రి సురేఖ ఓఎస్‌డీ సుమంత్ ఎపిసోడ్ పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నది పార్టీలోని మెజారిటీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి కూడా పోలీసులకు నచ్చజెప్పి పంపి ఉంటే… ఆమె స్థాయికి కూడా హుందాగా ఉండేదన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.

ఈ వివాద క్రమంలోనే… బీసీ మంత్రి మీద కక్ష కట్టారనే వాదనను తెరమీదకు తెచ్చింది కొండా ఫ్యామిలీ. ఐతే.. దానికి అనుబంధంగా ఇంకొందరు మరో ప్రశ్న వేస్తున్నారు. బీసీ మంత్రి దగ్గర ఓసీ ఓఎస్డీని ఎందుకు పెట్టుకున్నారన్నది అలా ప్రశ్నించే వాళ్ళ వాదన. ఇలా ఈ ఎపిసోడ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి సురేఖ వ్యవహారశైలికంటే… కూతురు సుస్మిత మాట్లాడిన మాటలే పెద్ద రచ్చకు దారి తీశాయట. పోలీసులు అత్యుత్సాహం చూపడం ఎంత తప్పో… సుస్మిత ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ మీద చేసిన వ్యాఖ్యలు కూడా అంతే తప్పు అన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి పార్టీ వర్గాల్లో. ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ భేటీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళడాన్ని ఇన్ఛార్జ్‌ తప్పు పడుతూనే… సుస్మిత ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా మాట్లాడటం ఏంటి..? ఏదన్నాఇష్యూ ఉంటే మా దృష్టికి తేవచ్చుకదా అని నేరుగా అడిగినట్టు సమాచారం. రెండు గంటల పాటు జరిగిన భేటీలో… ఇంచార్జ్‌ మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ల ముందు తనకు జరిగిన అవమానాలు గురించి… జిల్లాలో జరుగుతున్న కుట్రల గురించి మంత్రి ప్రస్తావించినట్టు సమాచారం. దాంతో… ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ… రచ్చకెక్కడం మంచిది కాదని నచ్చచెప్పినట్టు తెలిసింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా పార్టీ నుండి వెళ్లినట్టు సమాచారం. సాఫీగా సాగుతున్న పరిస్థితిలో వివాదాల్లోకి ఎందుకు వెళ్ళడం అనే తరహాలో పార్టీ నాయకత్వం ఉంది. మొత్తానికి.. కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి భట్టితో భేటీ, మీనాక్షి , మహేష్‌లతో మంతనాల తర్వాత ఈ వివాదానికి తెర పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ సర్కిల్స్‌లో. అదే టైంలో… మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ లా చల్లారినట్టేనా..? లేదంటే ఇది తుఫాన్‌ ముందు ప్రశ్నంతతా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....