Zepto Funding: తక్కువ టైంలో ప్రజలకు ఎక్కువగా చేరువైన క్విక్ కామర్స్ సంస్థ జెప్టో. ఈ సంస్థ తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న పెన్షన్ ఫండ్ అయిన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (కాల్పర్స్) ప్రస్తుత పెట్టుబడిదారు జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలోని కొత్త రౌండ్‌లో సుమారుగా $450 మిలియన్లు (రూ.4,000 కోట్లు) సేకరించినట్లు సంస్థ అక్టోబర్ 16న ప్రకటించింది. ఈ రౌండ్ ఇప్పుడు జెప్టో విలువను $7 బిలియన్లకు పెంచింది. గత ఏడాది జెప్టో విలువ $5 బిలియన్ల ఉంది.
READ ALSO: Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్ యుద్ధం.. ట్రెండింగ్‌లో ‘‘93,000’’.. భారత్‌తో సంబంధం..
జెప్టోలో అవెనిర్, అవ్రా, లైట్‌స్పీడ్, గ్లేడ్ బ్రూక్, ది స్టెప్‌స్టోన్ గ్రూప్, నెక్సస్ వెంచర్ పార్టనర్స్ వంటి ప్రస్తుత పెట్టుబడిదారులు కూడా తాజా రౌండ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు జెప్టో.. ఎటర్నల్ యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీస్ ఇన్‌స్టామార్ట్, టాటాస్ బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌలతో మరింత దగ్గరగా పోటీ పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. “నిరంతరంగా ఆపరేటింగ్ లివరేజ్‌ను పెంచుకుంటూ వ్యాపారాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి మా బృందం చేస్తున్న కృషికి ఈ ఫైనాన్సింగ్ చక్కని ఉదాహరణ. మా వద్ద ఇప్పుడు బ్యాంకులో దాదాపు $900 మిలియన్ల నికర నగదు ఉంది. అలాగే భవిష్యత్తు కోసం సరిపడా మూలధనం కూడా సిద్ధంగా ఉంది” అని జెప్టో సహ వ్యవస్థాపకుడు, CEO ఆదిత్ పలిచా వెల్లడించారు.
జెప్టో వద్ద ఉన్న $900 మిలియన్ల నగదు నిల్వ (సుమారు రూ.7,900 కోట్లు) ఎటర్నల్ వద్ద రూ.18,314 కోట్ల నగదు నిల్వ ఉంది. స్విగ్గీ వద్ద దాదాపు రూ.7,700 కోట్లు (రూ.5,354 కోట్ల నగదు నిల్వ, రాపిడోలో తన వాటాను అమ్మడం ద్వారా వచ్చిన రూ.2,400 కోట్ల నగదు ఆదాయం) ఉన్నాయి. జెప్టోకు వచ్చిన $450 మిలియన్లలో ఎక్కువ భాగం సెకండరీల రూపంలో వచ్చింది. అయినా కూడా ప్రారంభ మద్దతుదారులు కంపెనీలో తమ వాటాలను విక్రయించి కొత్త పెట్టుబడిదారులకు మార్గం సుగమం చేశారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. 2020లో కంపెనీ స్థాపించిన నాటి నుంచి జెప్టో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద రౌండ్లలో ఇది ఒకటని వాళ్లు వెల్లడించారు.
“గత 18 నెలల్లో జెప్టో ఆర్డర్ వాల్యూమ్‌ను 200% స్కేల్ చేసింది. అలా ఈ సంస్థ వారి దుకాణాలను స్థిరంగా లాభదాయకంగా మార్చగలిగింది. ఆ పనితీరు $500 బిలియన్+ ఇండియన్ గ్రోసరీ అవకాశం, జెప్టో ఒక తరతరాలుగా వినియోగదారుల ఇంటర్నెట్ కంపెనీని నిర్మిస్తుందనే నమ్మకాన్ని మాకు ఇచ్చాయి” అని గుడ్‌వాటర్ క్యాపిటల్ భాగస్వామి, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వివేక్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.
జెప్టో వాల్యుయేషన్ ఎంత?
తాజా నిధుల సేకరణతో జెప్టో విలువ ఇప్పుడు $7 బిలియన్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే సంస్థ విలువ $5 బిలియన్ల నుంచి 40 శాతం పెరిగింది. తాజాగా నిధుల సేకరణ పూర్తి చేసుకున్న జెప్టో.. ఇప్పుడు మార్కెట్లో పోటీ తీవ్రతను తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది. గత నెలల్లో ఎటర్నల్.. బ్లింకిట్, స్విగ్గీ.. ఇన్‌స్టామార్ట్ వంటి ఇతర లిస్టెడ్ ప్లేయర్‌లు లాభదాయక వృద్ధికి సాధించాయి. ఇదే సమయంలో నిధులు సేకరించిన జెప్టో మార్కెట్‌లో కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి పొందాలని, అలాగే కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఖర్చును పెంచాలని చూస్తుంది.
READ ALSO: Su-57 Fighter Jet India: సాహో భారత్.. ఇండియాలో రష్యా Su-57 యుద్ధ విమానాల తయారీ..





