Tragedy : కరీంనగర్ జిల్లాలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్యకేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మొదట అనుమానాస్పద మరణం కేసుగా నమోదు చేసిన ఈ ఘటనను, పూర్తి దర్యాప్తు తర్వాత భార్య సహా ఆరుగురి కుట్ర ద్వారా జరిగిందని తేల్చారు. కరీంనగర్ లోని సప్తగిరి కాలనీకి చెందిన ప్రైవేట్ డ్రైవర్ కత్తి సురేష్, 2015లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మౌనిక డబ్బుల కోసం పడుపు వృత్తిని ఎంచుకొని, ఆ సమయంలో దొమ్మాటి ఆజయ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త తరచుగా డబ్బు కోసం వేధించటం భరించలేక, సురేష్‌ను హత్యచేయాలని మౌనిక నిర్ణయించింది. మౌనికతో పాటు సహ-సెక్స్ వర్కర్లు అరిగే శ్రీజ, పోతు శివ కృష్ణ, వేముల రాధ (నల్ల సంధ్యలు) హత్యకు కుట్రపన్నారు. మెడికల్ ఫీల్డ్ నిపుణుడు శివ కృష్ణ, వయాగ్రా, అధిక BP మాత్రలను ఉపయోగించి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.
మొదటి ప్రయత్నం విఫలమైన తర్వాత, రెండవసారి BP మాత్రలు, నిద్ర మాత్రలను సురేష్ సేవిస్తున్న మద్యంలో కలిపారు. సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వెంటనే మౌనిక చీరతో అతడి మెడను ఉరేసి హత్యచేసింది. తర్వాత తన అత్తమామలకు ఫోన్ చేసి, భర్త స్పృహ కోల్పోయాడని తప్పుదారిలో పట్టించింది. కుటుంబ సభ్యులు సురేష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మరణం నుండి హత్యగా మార్చి దర్యాప్తు చేశారు. భార్య మౌనికతో పాటు మరో ఐదుగురు నిందితులను పక్కా ఆధారాల ఆధారంగా టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సీపీ గౌస్ అలం మీడియాకు వెల్లడించారు.
SVSN Varma: అందుకే మౌనంగా ఉంటున్నా.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్..





