ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఆర్మీ.. పాకిస్థాన్ నడ్డి విరిచింది. అనంతరం దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. తాజాగా పాకిస్థాన్ 1971 నాటి ఐకానిక్ లొంగుబాటు చిత్రాన్ని భారత్ సైన్యం ట్రోల్ చేసింది.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. కజకిస్థాన్ భూ బలగాల అధిపతి మేజర్ జనరల్ మెరెకే కుచెక్‌బయేవ్‌ను కలిశారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య శాశ్వత రక్షణ భాగస్వామ్యంపై చర్చించారు. అలాగే శిక్షణ సహకారం, సామర్థ్య నిర్మాణం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వంపై చర్చించారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను ఆర్మీ పంచుకుంది. ఇందులో 1971లో పాకిస్థాన్.. భారతదేశానికి లొంగిపోయినప్పటి ఐకానిక్ చిత్రం కనిపించింది. పాకిస్థాన్ అప్పటి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ.. భారతదేశ లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా సమక్షంలో లొంగుబాటు ఒప్పందంపై సంతకం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మే 7న పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాల్పుల విరమణకు రావడంతో భారత్ అంగీకరించింది. మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
On the sidelines of the #UNTCC2025, #GeneralUpendraDwivedi, #COAS met with Major General Mereke Kuchekbayev, Chief of Land Forces, Kazakhstan. The meeting reaffirmed the enduring defence partnership between the two nations, with a focus on training cooperation, capacity building… pic.twitter.com/inKEuFE4qN
— ADG PI – INDIAN ARMY (@adgpi) October 14, 2025





