Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. బుధవారం కిషన్‌గంజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మత శక్తులను అరికట్టడానికి ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్య సొంత పార్టీ అయిన రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ కలిసి పొత్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
READ MORE: Bihar Elections: 16 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఆర్జేడీతో కలిసి పోటీ లేనట్లే!
బీహార్‌లో AIMIM 35 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని అఖ్తరుల్ ఇమాన్ పేర్కొన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ 25 స్థానాల్లో, రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో బలంగా పోటీదారుగా నిలిచి కొత్త ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయని ఇమాన్ అభిప్రాయపడ్డారు. తమ పోరాటం అధికారం కోసం కాదని.. దేశంలో న్యాయాన్ని స్థాపించడమే తమ ధ్యేయమన్నారు. అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశామని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించింది. సీమాంచల్ ప్రాంతంలో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి ఒవైసీ పార్టీ ఇప్పటికే కృషి చేస్తోంది. కిషన్‌గంజ్, కతిహార్, అరారియా వంటి జిల్లాల్లో AIMIM ప్రభావం ఇప్పటికే కనిపించింది. మరోవైపు.. పొత్తు ప్రకటించక ముందు.. అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ నాయకత్వంపై దాడి చేశారు.
READ MORE: డ్యూయల్ టోన్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్‌లతో Honor Earbuds 4 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!





