28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ జంప్.. హైదరాబాద్‌లో తులం లక్ష 29 వేలు!

Date:

దేశంలో బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత 10 రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు పసిడి భారీగానే పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో నేడు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,889గా.. 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.11,815గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.540 పెరిగి.. రూ.1,28,890గా నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.500 పెరిగి రూ.1,18,150 ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,890గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,150గా కొనసాగుతోంది. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం అనే మాట కూడా ఎత్తడానికి బయపడుతున్నారు. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో.. బంగారంకు భారీగా డిమాండ్ పెరుగుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గోల్డ్ పెరుగుదలకు అంతర్జాతీయంగా పలు పరిణామాలు కూడా కారణం అవుతాయి. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Prashant Kishor: బిహార్‌ ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం!

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సిల్వర్‌పై కూడా గత 10 రోజులుగా భారీగా పెరుగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. 1,90,000గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.2,07,000గా ట్రేడ్ అవుతోంది. ఈ వారం రోజుల్లో వెండి ధరలు వరుసగా 3, 7, 7, 6, 0, 5, 4, 1 వేలు పెరిగింది. పెరిగిన ధరలతో సామాన్య జనాలు వెండి కొనడానికి కూడా ఇప్పుడు వెనకంజ వేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

'கூட்டம் கூடுவதற்கு ஏற்ற இடமல்ல' – விஜய்யின் பிரசாரத்துக்கு தேர்தல் அலுவலர் அனுமதி மறுத்தது ஏன்?

தவெக தலைவர் விஜய் நாளை பெரம்பூரிலிருந்து தனது பிரசாரத்தை தொடங்குவதாக திட்டமிட்டிருந்தார்....

Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్...

ಯುಪಿಎಸ್ ಪರೀಕ್ಷೆಗೆ ಕಠಿಣ ಪರಿಶ್ರಮ, ಸ್ಥಿರತೆ ಮತ್ತು ಸ್ಮಾರ್ಟ್ ಓದು ಅಗತ್ಯ- ಕಿರಣ್ ಕಾಮ್ಟೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in):  ಯುಪಿಎಸ್ ಪರೀಕ್ಷೆ ಭೇದಿಸುವುದು ಸುಲಭವಲ್ಲ. ಅದಕ್ಕೆ ಕಠಿಣ...

ഇറാനെതിരെ നെതന്യാഹുവിന് വിജയിക്കാനാകില്ല: ഇസ്രഈല്‍ മുന്‍പ്രധാനമന്ത്രി

ടെല്‍ അവീവ്: സൈനികക്ഷാമം നേരിടുന്ന ഇസ്രഈലിന് ഇറാനെതിരെ വിജയിക്കാനാകില്ലെന്ന മുന്നറിയിപ്പുമായി മുന്‍...