CM Revanth: వరంగల్ జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 15) సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒకటి గంటకు హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకోనున్నారు. అనంతరం ఆయన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమం వడ్డేపల్లి PGR గార్డెన్ లో జరగనుండగా, సీఎం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగరంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
CM Revanth: నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి..
Date:





