ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బిరెల్లిలో దహన సంస్కారానికి వెళ్లి చెరువులో దిగి మంకిడి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ అనే యువకుడు చెరువులోకి దిగాడు. అయితే నవీన్, వినయ్, రణధీర్, అనే నలుగురు స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకున్నరు. కానీ, పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన యువకుడు కోసం బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Tragedy: దహన సంస్కారానికి వెళ్లి.. చెరువులోకి దిగి యువకుడు గల్లంతు
Date:





