Police Constable Fraud: పోలీసోడే మోసగాడైతే.. జనం రోడ్డు పాలవుతారు. విశాఖలోని ఎండాడలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబం చీటీల పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టింది. ఏకంగా రూ.3 కోట్ల జనం సొమ్ముతో కానిస్టేబుల్ అండ్ ఫ్యామిలీ జంప్ అయింది. దీంతో బాధితులు ఏం చేయాలో అర్ధం కాక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం.. ఇలాంటి అవసరాలకు భారీగా డబ్బులు కావాలి. పైసా పైసా కూడబెడితేనే మధ్యతరగతి వారు జీవితంలో తమ అవసరాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది తమ డబ్బుకు కాస్త ఎక్కువ వడ్డీ రావాలని ఆశిస్తారు. ఇందులో భాగంగా చాలా మంది చీటీలు కట్టి మోసపోతున్నారు. ఓ వైపు చీటీల నిర్వాహకులు కోట్లకు పడగెత్తుతుంటే.. చీటీలు వేసి వారు మాత్రం డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు….
READ ALSO: UP: యోగి ఇలాకాలో అంతే.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇఫ్తికార్ ఖాన్ హతం..
లక్ష రూపాయల నుంచి రూ. 5 లక్షల వరకు చీటీలు
ఆయన పేరు జగ్గారావు. అనకాపల్లి డివిజన్‌లో AR హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. భార్య రవణమ్మ, కూతురుతో కలిసి ఎండాడలో ఉంటున్నారు. జగ్గారావు పోలీస్ కావడంతో.. అతని భార్య రవణమ్మ.. పోలీసమ్మ అవతారం ఎత్తింది. స్థానికంగా బాగానే పరిచయాలు పెంచుకుంది. అంతే కాదు 2019లో చీటీల వ్యాపారం షురూ చేసింది రవణమ్మ. లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు చీటీలు నడిపించేది. క్రమంగా చీటీల దందాలోకి జగ్గారావు కూడా దిగాడు. బంధువులు, చుట్టుపక్కల అపార్టుమెంట్లలో ఉండేవాళ్లు, చిన్న చిన్న ఉద్యోగులు, ఇళ్లల్లో పని చేసేవారు, వాచ్‌మెన్లు.. ఇలా ఎవరినీ వదలలేదు. అందరితో మంచి మాటలు కలిపి చీటీలు వేయించారు. జనాల లక్షలకు లక్షలు వసూలు చేశారు. మరోవైపు జనం కూడా పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం చీటీలు వేసుకుంటూ వచ్చారు..
చాలా ఏళ్ల నుంచి నమ్మకంగా చీటీలు నడిపిన రవణమ్మ.. మొన్నటికి మొన్న రాత్రికి రాత్రి దుకాణం సర్దేసింది. ఇళ్లు ఖాళీ చేసి జగ్గారావు, రవణమ్మ ఎక్కడికో వెళ్లిపోయారు. ఇల్లు తాళం ఉండే సరికి బాధితులంతా ఒక్కసారిగా షాకయ్యారు. తమ డబ్బులు పోయాయని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మరోవైపు జగ్గారావు, రవణమ్మ దంపతుల కొడుకు స్వరూప్ నెదర్లాండ్స్‌లో ఉండి కథ నడిపించాడని బాధితులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు.. ఇంట్లో ఉన్న జగ్గారావు, రవణమ్మ కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.
READ ALSO: Khammam Murder Case: యూట్యూబ్‌లో చూసి మర్డర్ చేయడం నేర్చుకున్నారు! వెలుగులోకి సంచనల నిజాలు..





