6
December, 2025

A News 365Times Venture

6
Saturday
December, 2025

A News 365Times Venture

Richa Ghosh: దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన రిచా ఘోష్!

Date:

ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించింది. గురువారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో రిచా 77 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. రిచా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత జట్టు 251 పరుగులు చేసింది. 102/6తో పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న జట్టును రిచా ఒంటిచేత్తో ఆడుకుంది. ఓ దశలో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అని అనిపిచింది. రిచా దూకుడైన ఆటతో టీమిండియాకు భారీ స్కోర్ అందించింది.

ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేసింది. దాంతో ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన క్లోయ్ ట్రయాన్ పేరిట ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కొలంబోలో శ్రీలంకపై 74 పరుగులు చేసింది. ఆ రికార్డును రిచా ఘోష్ బద్దలు కొట్టింది. రిచాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. బాగా ఆడిందని ఫాన్స్, మాజీలు పొగిడేస్తున్నారు.

Also Read: Hyderabad Tragedy: అలసిపోయిన అమ్మ.. చిన్న కొడుకు కళ్లెదుటే దారుణం!

ఒకానొక సమయంలో భారత స్కోరు 102/6. భారత్ 150 పరుగులకు చేరుకోవడం కూడా అసంభవమని అనిపించింది. కానీ రిచా అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా భారత్‌ గట్టెక్కింది. రిచా మొదట అమన్‌జోత్ కౌర్‌తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత స్నేహ్ రాణాతో ఎనిమిదో వికెట్‌కు 88 పరుగులు జోడించింది. మహిళల వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు లేదా అంతకంటే తక్కువ స్కోరుకు ఇది మూడవ అత్యధిక భాగస్వామ్యం.

8వ వికెట్ లేదా అంతకంటే తక్కువ (మహిళల వన్డే)కు అత్యధిక భాగస్వామ్యాలు:
115 – రాచెల్ స్లేటర్ & ప్రియనాజ్ ఛటర్జీ (స్కాట్లాండ్) vs బంగ్లాదేశ్, లాహోర్, 2025
106 – అలాన్నా కింగ్ & బి మూనీ (ఆస్ట్రేలియా W) vs పాకిస్తాన్, కొలంబో, 2025
88 – నీలాక్షి డి సిల్వా & ఓషాది రణసింఘే (శ్రీలంక) vs ఇంగ్లాండ్, హంబన్‌టోట, 2019
88 – రిచా ఘోష్ & స్నేహ్ రాణా (భారతదేశం) vs దక్షిణాఫ్రికా, విశాఖపట్నం, 2025

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....