29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ.. పవన్‌ కల్యాణ్‌ సూచనలతో ఉత్తర్వులు..

Date:

Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు కాకినాడ జిల్లా, ఉప్పాడ తీర ప్రాంత మత్స్సకారుల సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కమిటీలో పరిశ్రమల, మత్స్య శాఖల కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఉంటారు. వీరితోపాటు కాకినాడ జిల్లా కలెక్టర్ చే నామినేట్ అయ్యే మత్స్యకార వర్గానికి చెందిన సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ఈ కమిటీ కృషి చేయనుంది.. అయితే, మత్స్యకారుల సమస్యలపై తక్షణం స్పందించి కమిటీ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

Read Also: Nidhhi Agerwal : నేరేడు పళ్ళు.. నిధి అగర్వాల్ కళ్ళు.. హాట్ ఫొటోస్

కాగా, కాలుష్య కారక పరిశ్రమలను మూసి వేయాలని, ఫార్మా కంపెనీల నుంచి విడుదల అవుతున్న వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపద దెబ్బతింటోందని రెండ్రోజులుగా మత్స్యకారులు ఆందోళనకు దిగడం.. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించడం.. డిమాండ్లను పరిష్కరిస్తామని, ఆయా సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ మత్స్యకారులకు తెలపడం.. దీంతో ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ವೈಚಾರಿಕ, ವೈಜ್ಞಾನಿಕ ಮನೋಭಾವ ಬೆಳೆಸಿಕೊಳ್ಳಬೇಕು: ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ

  ಮೈಸೂರು :ಮಾರ್ಚ್ -28: ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ವೈಚಾರಿಕ, ವೈಜ್ಞಾನಿಕ ಮನೋಭಾವ ಬೆಳೆಸಿಕೊಳ್ಳಬೇಕು....

ഒഡീഷയില്‍ രാമനവമി ആഘോഷങ്ങള്‍ക്കിടെ വെടിയുതിര്‍ത്ത് ബി.ജെ.പി എം.എല്‍.എ; പരിഭ്രാന്തരായി ജനക്കൂട്ടം; വ്യാപക അക്രമങ്ങള്‍

ഭുവനേശ്വര്‍: ഒഡീഷയില്‍ നടന്നരാമനവമി ആഘോഷങ്ങള്‍ക്കിടയില്‍ ബി.ജെ.പി എം.എല്‍.എ വെടിയുതിര്‍ത്ത് ആള്‍ക്കൂട്ടത്തിനിടയില്‍ പരിഭ്രാന്തി...

'மாற்றுக் கட்சி சீனியர்கள்..' ஸ்டாலின், உதயநிதிக்கு எதிராக விஜய் டிக் அடித்திருக்கும் அந்த இருவர்!

திமுகவின் வேட்பாளர் பட்டியல் வெளியாகியிருக்கிறது. 164 வேட்பாளர்கள் திமுக சார்பில்...

Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మరింత తీవ్ర రూపం...