21
April, 2026

A News 365Times Venture

21
Tuesday
April, 2026

A News 365Times Venture

PM Modi: ప్రపంచం మొత్తం భారత్‌ వైపే.. బాధితులకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నా..

Date:

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని.. దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్‌కు అండగా నిలిచిందని.. పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భారోసా ఇచ్చారు.

READ MORE: Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. తొలి బ్యాట్స్‌మన్‌గా..!

“కశ్మీర్‌లో శాంతి తిరిగి నెలకొంటోంది. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. శత్రువులకు ఇది నచ్చడం లేదు. ఉగ్రవాద నాయకులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ సవాలును ధీటుగా ఎదుర్కోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాం.” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అనంతరం.. ఇస్రో మాజీ చీఫ్, శాస్త్రవేత్త కె. కస్తూరిరంగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కస్తూరిరంగన్ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమని స్పష్టం చేశారు.

READ MORE: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కేసు పగ్గాలు స్వీకరించిన NIA..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഡോളര്‍ ഞങ്ങള്‍ തരാം, ചൈനീസ് യുവാനില്‍ എണ്ണ വാങ്ങണ്ട; യുദ്ധം ബാധിച്ചാല്‍ വായ്പ നല്‍കാമെന്ന് യു.എ.ഇയോട് അമേരിക്ക

  അബുദാബി: ഇറാന്‍ യുദ്ധം യു.എ.ഇയുടെ സമ്പദ്‌വ്യവസ്ഥയെ ബാധിച്ചാല്‍ ഡോളര്‍ വായ്പ...

33% இட ஒதுக்கீடு Vs தொகுதி மறுவரையறை… பெண்களை அரசியல் கருவிகளாகப் பயன்படுத்தாதீர்கள்!

அரசியல் கட்சிகள் தொடங்கி மத்திய, மாநில அரசுகள் வரை, பெண்கள் மீதான...

Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…

ఫార్మాసిటీ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది....

ವಿನಯ್ ಕುಲಕರ್ಣಿ ಶಾಸಕ ಸ್ಥಾನ ರದ್ದು ಮಾಡುವ ಬಗ್ಗೆ ಯಾವುದೇ ಆಧಿಕೃತ ಮಾಹಿತಿ ಬಂದಿಲ್ಲ- ಸ್ಪೀಕರ್ ಯುಟಿ ಖಾದರ್

ಮಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,20,2026 (www.justkannada.in):  ಯೋಗೇಶ್ ಗೌಡ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆಗೆ...