20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

Date:

China and Russia Back Cuba: చిన్న దేశమైనా.. అగ్రరాజ్యం అమెరికాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటుంది క్యూబా.. అయితే, ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ, క్యూబాకు మద్దతుగా చైనా, రష్యా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా క్యూబా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా.. క్యూబాపై ఇంధన దిగ్బంధనాన్ని కఠినతరం చేయడంతో, చమురు మరియు గ్యాస్ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు పెరిగినట్లు సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో, రష్యా నుండి రెండు చమురు ట్యాంకర్లు క్యూబా వైపు ప్రయాణించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. అమెరికా ఈ సరఫరాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. క్యూబాకు రష్యా చమురు సరఫరా చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, చైనా కూడా క్యూబాకు మద్దతుగా ముందుకు వచ్చింది. ముఖ్యంగా సౌరశక్తి ప్రాజెక్టుల ద్వారా క్యూబా విద్యుత్ సంక్షోభాన్ని తగ్గించేందుకు సహకారం అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాలను అందించాలనే దిశగా చైనా పనిచేస్తోంది.

రష్యా, క్యూబాకు ఆర్థిక మరియు ఇంధన సహాయం అందిస్తామని ప్రకటించింది. అమెరికా ఆంక్షలను విమర్శిస్తూ, క్యూబాకు అవసరమైన మద్దతు కొనసాగిస్తామని తెలిపింది. ఈ పరిణామాల మధ్య, డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూబాపై కఠిన వైఖరిని కొనసాగిస్తామని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద, క్యూబా ఇంధన సంక్షోభం ఇప్పుడు గ్లోబల్ జియోపాలిటికల్ పోరాటంగా మారుతోంది. ఒకవైపు అమెరికా ఆంక్షలు, మరోవైపు చైనా-రష్యా మద్దతు.. ఈ పరిస్థితి అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకువస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

`9 நாள்களுக்குப் பிறகு தகனம் செய்யப்பட்ட மாணவியின் உடல்' – கண்ணீரில் வேடநத்தம் கிராமம்!

தூத்துக்குடியில் கொலை செய்யப்பட்ட பள்ளி மாணவியின் உடல் இன்று பெற்றோர்களிடம் ஒப்படைக்கப்பட்டது....

AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో కీలక...

ರೂಪಾಯಿ ಮೌಲ್ಯ ಕುಸಿದ್ರೆ ಪ್ರಧಾನಿ ವರ್ಚಸ್ಸು ಕುಸಿದಂತೆ- ರಣದೀಪ್ ಸಿಂಗ್ ಸುರ್ಜೇವಾಲ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,20,2026 (www.justkannada.in): ಡಾಲರ್ ಎದುರು ರೂಪಾಯಿ ಮೌಲ್ಯ  ಐತಿಹಾಸಿಕ ಕುಸಿತ...

വീട്ടുജോലിക്കാരിയല്ല പങ്കാളിയാണ്; വീട്ടുജോലികള്‍ ചെയ്യാത്തത് ക്രൂരതയല്ല; വിവാഹമോചനക്കേസില്‍ സുപ്രീംകോടതി

ന്യൂദല്‍ഹി: സ്ത്രീകള്‍ പാചകം ഉള്‍പ്പെടെയുള്ള വീട്ടുജോലികള്‍ ചെയ്യാത്തത് ക്രൂരതയായി കണക്കാക്കാനാകില്ലെന്ന നിര്‍ണായക...