15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

Date:

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌ హౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) రంగంలోకి దిగి ఫామ్‌ హౌస్‌ను చుట్టుముట్టింది.

Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..

పోలీసుల సోదాల్లో ఫామ్‌ హౌస్‌లో భారీగా కొకైన్ , ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రజాప్రతినిధి సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారిస్తున్నారు.

Ugadi Gift : పేదలకు ఉగాది కానుక.. ఉగాదికి 2,064 ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు.!

మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్‌ హౌస్‌ కావడంతో పాటు, పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టుబడిన వీఐపీలు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

“உளவுத் துறையைக் கையாளப் போகும் முதல் பெண் டி.ஜி.பி”- அதிரடி மாற்றங்களைக் கையில் எடுத்த அரசு!

தமிழகத்தில் கடந்த சில நாட்களாக நடந்துவந்த குற்றசெயல்களும், அதை தொடர்ந்து...

Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. ఇది విషతుల్యాలను తొలగించడం,...

ಸಮಗ್ರ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಯೋಗ-ವಿಜ್ಞಾನದ ಸಮನ್ವಯ ಅಗತ್ಯ: ಶಿವರಾತ್ರಿ ದೇಶಿಕೇಂದ್ರ ಸ್ವಾಮೀಜಿ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in):  ಭಾರತ ದೇಶ ಜಗತ್ತಿಗೆ ಕೊಟ್ಟತಂಹ ಕೊಡಗೆಗಳಲ್ಲಿ ಯೋಗವೂ...

ആര്‍ത്തവ അവധി സ്ത്രീകളുടെ അവകാശങ്ങളുടെ ഭാഗമാക്കണം; സുപ്രീം കോടതിക്കെതിരെ പോളിറ്റ് ബ്യൂറോ

ന്യൂദല്‍ഹി: ആര്‍ത്തവ അവധികള്‍ നിയമവിധേയമാക്കിയാല്‍ സ്ത്രീകളെ ജോലിക്കെടുക്കാന്‍ കമ്പനികള്‍ മടിക്കുമെന്ന സുപ്രീം...