21
February, 2026

A News 365Times Venture

21
Saturday
February, 2026

A News 365Times Venture

Minister Nara Lokesh: మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

Date:

Minister Nara Lokesh: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను మంత్రి పరిశీలించారు. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి నిపుణులు రూపొందించిన వీడియోను వీక్షించారు. పలు సూచనలు చేశారు. ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా నిలవాలి. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా సెంట్రల్ లైబ్రరీ ఉండాలన్నారు.. ఆర్కైవ్స్, ఆడిటోరియం వసతులతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని.. జ్ఞాన కేంద్రంగానే కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలి. అన్ని వర్గాల ప్రజలు సెంట్రల్ లైబ్రరీతో అనుసంధానం కావాలన్నారు మంత్రి లోకేష్.. ఇందుకు సంబంధించి మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు…

Read Also: క్రిస్టల్ క్లియర్ కాల్స్, అడాప్టివ్ సౌండ్.. Sony WH-CH720N వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ సగం ధరకే..

ఇక, ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షలు, అభ్యసన సామర్థ్యాల పెంపుపై చర్చ జరిగింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు తీరు, క్లిక్కర్ వీడియోలు, పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చించారు. విద్యార్థుల హాజరు, మార్కులు వంటివి తెలుసుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన లీప్ యాప్ ను ఎంత మంది తల్లిదండ్రులు డౌన్ లోడ్ చేసుకున్నారో మంత్రి ఆరా తీశారు… విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు మంత్రి నారా లోకేష్‌..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tariff: 'அதிகாரத்தை மீறி.!' – வரிக்கு எதிராக அமெரிக்க உச்ச நீதிமன்றம் தீர்ப்பு; ட்ரம்ப் – 'அவமானம்'?

உலக நாடுகளையே ஆட்டிப் படைத்த அஸ்திரம் அமெரிக்க அதிபர்‌ ட்ரம்பின் 'பரஸ்பர...

Off The Record: జనసేన ఎమ్మెల్యే vs టీడీపీ ఇన్ఛార్జ్? పాలకొండలో కూటమి కుమ్ములాటలు?

Off The Record: ఆ రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్‌ కూటమిలో అంటుకున్న...

ಉಚಿತ ಭಾಗ್ಯಗಳ ಬಗ್ಗೆ ಸುಪ್ರೀಂ ಟೀಕೆ: ಸರ್ಕಾರಕ್ಕೆ ಕುಟುಕಿದ ಶಾಸಕ ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ್

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,20,2026 (www.justkannada.in): ಇತ್ತೀಚೆಗೆ ಪ್ರಕರಣವೊಂದರ ವಿಚಾರಣೆ ವೇಳೆ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು...

മലപ്പുറത്തെ ലോറിയപകടം; മണിക്കൂറുകളുടെ ശ്രമം പരാജയപ്പെട്ടു, മുസ്തഫ മരിച്ചു

മലപ്പുറം: ആതവനാട്ടെ 65 അടി താഴ്ചയുള്ള ക്വാറിയിലെ വെള്ളക്കെട്ടിലേക്ക് മറിഞ്ഞ മിനിലോറിയിലെ ക്ലീനർ...