5
December, 2025

A News 365Times Venture

5
Friday
December, 2025

A News 365Times Venture

Bollywood: ఒకే ఫ్రేమ్‌లో యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్‌ బీస్ట్.. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్.. కొత్త సినిమా రాబోతోందా..?

Date:

MrBeast Meets Bollywood’s Legendary Trio: హిందీ సినిమాలో అత్యుత్తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా మంది దిగ్గజ నటులు ఉన్నారు. నటనతోపాటు ఫిట్‌నెస్‌కి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యూట్యూబర్‌తో పాటు హిందీ సినిమాకి చెందిన ఈ ముగ్గురి ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో పాటు ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌ కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు సూపర్‌స్టార్ హీరోలకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ ముగ్గురు దిగ్గజ హీరోలు హిందీ సినిమాకు గణనీయమైన కృషి చేస్తున్నారు.

READ MORE: IRCTC: పనిచేయని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌.. దీపావళి ప్రయాణికుల ఆందోళన

తాజాగా యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) బాలీవుడ్ దిగ్గజ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. అక్టోబర్ 16న సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరు సమావేశమయ్యారు. అక్కడి ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను తాజాగా ఫోస్ట్ చేసిన బీస్ట్.. “హే ఇండియా, మనమందరం కలిసి ఏదైనా చేద్దామా?” అని ఇంగ్లీస్‌లో రాసుకొచ్చాడు. ఈ ఫోటో భారతీయ అభిమానులను ఉత్సాహపరిచింది. ఇప్పటికే యూట్యూబ్ స్టార్, బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్‌ల మధ్య కొత్త సహకారం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నాలుగురు కలిసి ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

READ MORE: South Heroines: బాలీవుడ్‌లో సౌత్ బ్యూటీస్ డిమాండ్.. వరుస ప్రాజెక్ట్స్ తో హీరోయిన్ బిజీబిజీ.?

మరోవైపు.. బాలీవుడ్‌లోని ఈ ముగ్గురు ఖాన్‌లు మూడు దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు. ఇప్పటికీ వారి స్టార్‌డమ్ చెక్కుచెదరలేదు. వీరి దోస్తీ గురించి ఎప్పటికప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉంటారు. ముంబైలో ఆమిర్ చిత్రం “సితార్ జమీన్ పర్” ప్రదర్శనలో వీళ్లు చివరిసారిగా కలిసి కనిపించారు. ఈ ముగ్గురూ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ “ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కి పనిచేశారు. అయితే.. ఏ సన్నివేశంలోనూ కలిసి కనిపించలేదు.

Untitled Design 68 1760674121

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....