5
December, 2025

A News 365Times Venture

5
Friday
December, 2025

A News 365Times Venture

Traffic Restrictions in Srisailam and Kurnool District: శ్రీశైలం వెళ్తున్నారా? ఇది మీ కోసమే..

Date:

Traffic Restrictions in Srisailam and Kurnool District: శ్రీశైలం వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే శ్రీశైలంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. తాత్కాలికంగా పూర్తిగా ట్రాఫిక్‌ నిలిపివేయనున్నారు.. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు ప్రధాని.. అయితే, 16వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీశైలంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. 6న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.. హైదరాబాద్ – శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు తాత్కాలికంగా బంద్‌ చేయనున్నారు.. అయితే, శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన ముగిసిన అనంతరం వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి..

Read Also: DSP Pooja Pandey: రూ.3 కోట్ల హవాలా డబ్బు దోపిడీ.. మహిళా డీఎస్పీ సహా 11 మంది పోలీసులపై కేసు

ఇక, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలు దారి మల్లించనున్నారు అధికారులు.. కడప నుండి కర్నూలు, హైదారాబాద్ వెళ్లే వాహనాలు పాణ్యం, గడివేముల, మిడ్తూరు, బ్రాహ్మణ కొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మీదుగా మళ్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. నంద్యాల నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు పాణ్యం, బనగానపల్లె, డోన్ మీదుగా మళ్లించనున్నారు.. శ్రీశైలం నుండి ఆత్మకూరు మీదుగా అనంతపురం వైపు వెళ్లే వాహనాలు బండి ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, డోన్ మీదుగా మళ్లించనున్నారు.. ఆత్మకూరు నుండి బళ్ళారి వైపు వెళ్లే వాహనాలు బ్రాహ్మణకొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, ఆలంపూర్ బ్రిడ్జి & ఆలంపూర్ చౌరస్తా, శాంతినగర్ మీదుగా మళ్లిస్తారు.. అనంతపురం నుండి కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు గుత్తి, జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ మీదుగా మళ్లిస్తారు..

మరోవైపు.. అనంతపురం నుండి నంద్యాల వైపు వెళ్ళు వాహనాలు.. డోన్ , బనగానపల్లె, నంద్యాల మీదుగా మళ్లించినున్నట్టు అధికారులు వెల్లడించారు.. బళ్ళారి నుండి హైదరాబాదు ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ మీదుగా మల్లింపు.. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్ళే వాహనాలు తమ్మరాజుపల్లి, కాల్వబుగ్గ, ఎంబాయి, రామళ్లకోట, వెల్దుర్తి, కర్నూలు మీదుగా మల్లింపు.. ఓర్వకల్లు నుండి హైదరాబాదు వైపు వెళ్ళే వాహనాలు మళ్లించనున్నారు.. అయితే, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. ట్రాఫిక్‌ మళ్లిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికులు.. వాహనదారులు తమ రూట్‌ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....