KTR : వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభమైందన్నది సంతోషకర విషయం. ఈ యూనిట్ నుంచి టీషర్టులు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి” అని పేర్కొన్నారు.
కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వ పాలనలో 2023లో రూపుదిద్దుకుందని కేటీఆర్ గుర్తుచేశారు. యంగ్ వన్ కార్పొరేషన్‌కు చెందిన 11 ఫ్యాక్టరీలకు తాము భూమిపూజ నిర్వహించామని తెలిపారు. అన్ని యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే వరంగల్ దేశంలోని ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా అవతరిస్తుందని చెప్పారు. అంతేకాకుండా.. “వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకు.. ఈ ఆలోచనతోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశాం. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ పరిశ్రమల శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది” అని అన్నారు.
Trump China Tariff: క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసిన ట్రంప్ నిర్ణయం.. $2 ట్రిలియన్లు ఆవిరి





