Hyderabad Fraud: సినిమాల్లో విలన్ తరహాలో ఓ కిలాడీ లేడీ.. తోటి మహిళలను చీటింగ్ చేసింది. తనకు 2 వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని నమ్మించింది. తన దగ్గర పెట్టుబడి పెట్టే డబ్బుకు రెట్టింపు ఇస్తానని నమ్మబలికింది. అంతా నిజమని నమ్మిన మహిళలు పెట్టుబడి పెట్టారు. వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో రూ. 18 కోట్లు తీసుకుని ముఖం చాటేసింది. తమ డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి దాడి చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ పటాన్‌చెరులో జరిగింది.
READ ALSO: AP Fake Liquor Case: జనార్దన్ రావు అరెస్టు చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం!
ఆ మహిళ పేరు విద్య. ప్రస్తుతం పటాన్‌చెరులోని APR గ్రాండియాలో నివాసం ఉంటోంది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ.. ఏకంగా రూ.18 కోట్లు బురిడీ కొట్టేసిందంటే నమ్మగలరా? కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే.. ఈమె బాధితులు డబ్బులు అడిగిన పాపానికి ఇదిగో ఇలా.. స్ట్రెచర్ మీద పడి ఆస్పత్రి పాలయ్యారు.. విద్య గతంలో సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో నివాసం ఉండేది. ఆ సమయంలో చాలా మంది మహిళలను తన మాయ మాటలతో బుట్టలో వేసుకుంది. ఏపీలో ఓ ఎమ్మెల్యేతో పరిచయాలు ఉన్నాయంటూ అందరినీ నమ్మించింది. ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి రూ. 2 వేల కోట్లు వస్తాయని చెప్పింది. అందుకోసం భారీ మొత్తంలో కంటైనర్స్ కొనుగోలు చేయాలని.. ఆ డబ్బు పెట్టుబడిగా పెడితే.. రెట్టింపు సొమ్ము ఇస్తానని నమ్మించింది..
అందరినీ గదిలో పెట్టి ఇనుప రాడ్లతో దాడి
పాపం ఇదంతా నమ్మిన ఆ మహిళలు పెట్టుబడుల రూపంలో విద్య దగ్గర డబ్బులు డిపాజిట్ చేశారు. తీరా డబ్బులు వసూలు చేసిన తర్వాత వారాసిగూడ నుంచి పటాన్‌చెరుకు మకాం మార్చింది విద్య. ఐతే మహిళలు అంతా డబ్బులు అడగడంతో అక్టోబర్ 9న ఇస్తానని చెప్పింది. అందర్నీ ఒకే చోటకు రప్పించింది. తీరా వచ్చాక…. అందరినీ గదిలో పెట్టి ఇనుప రాడ్లతో దాడి చేయించింది. దీంతో ఓ బాధితురాలికి తీవ్రగాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.. దాడి అనంతరం విద్యపై బాధితులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా దాడి చేసినపుడు ఫిర్యాదు చేస్తే పటాన్ చెరుపోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు…
READ ALSO: Weight Loss Discovery: ఊబకాయంతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్..





