6
December, 2025

A News 365Times Venture

6
Saturday
December, 2025

A News 365Times Venture

Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి

Date:

మయన్మార్‌లో విషాదం చోటుచేసుకుంది. బౌద్ధ ఉత్సవంపై పారాగ్లైడర్ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. 47 మంది గాయపడ్డారు.

గుమిగూడిన జనంపై పారాగ్లైడర్ రెండు బాంబులు వేయడంతో 24 మంది చనిపోయారని జుంటా వ్యతిరేక పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన స్థానిక అధికారి తెలిపారు. 47 మంది గాయపడ్డారని చెప్పారు. బౌద్ధ మూలాలతో కూడిన జాతీయ సెలవుదినం అయిన థాడింగ్యుట్ పండుగ కోసం సోమవారం సాయంత్రం చాంగ్ యు టౌన్‌షిప్‌లో సుమారు 100 మంది గుమిగూడి ఉండగా ఈ దాడి జరిగింది.

ఇది కూడా చదవండి: Guntur Murder: పొట్టిగా ఉన్నాడని బావని పొడిచి చంపిన బావమరిది..

థాడింగ్యుట్ పండుగను లైట్ల పండుగ అని కూడా పిలుస్తారు. మయన్మార్ అంతటా కొవ్వొత్తులు, లాంతర్లు. సామూహిక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశం సైనిక నిర్బంధం, రాబోయే ఎన్నికలను నిరసిస్తూ.. అలాగే ఆంగ్ సాన్ సూకీతో సహా రాజకీయ ఖైదీల విడుదల కోసం కొవ్వొత్తుల ప్రదర్శన కూడా జరిగింది.

ఇది కూడా చదవండి: Singer Rajvir Jawanda: పంజాబ్ గాయకుడు రాజ్‌వీర్ జవాండా కన్నుమూత

2021 తిరుగుబాటులో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి మయన్మార్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. అప్పటి నుంచి 5,000 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా విమానాలు, జెట్ ఇంధన కొరత మధ్య తరచుగా ఆకాశం నుంచి మోర్టార్ తూటాలను జారవిడిచే పారామోటర్ దాడులను సైన్యం ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా చాంగ్ యు టౌన్‌షిప్‌లో కూడా ఇలాంటి దాడులు జరిగినట్లుగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. ఇక తిరుగుబాటు తర్వాత మొదటిసారిగా డిసెంబర్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....